Telangana Current affairs | తెలంగాణ
గోల్డ్‌మెడల్
ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన మెహుల్ బొరాడ్ గోల్డ్‌మెడల్ సాధించాడు. జపాన్‌లోని టోక్యోలో జూలై 10 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ ఒలింపియాడ్‌లో భారత్ నుంచి ఐదుగురితో కూడిన బృందంలో అతడు సభ్యుడిగా పాల్గొన్నాడు. ఈ బృందంలో ముగ్గురు బంగారు, ఇద్దరు రజత పతకాలను గెలుచుకున్నారు. బొరాడ్తో పాటు ఆదిత్య (ఢిల్లీ), ధ్రువ్షా (పుణె)లకు గోల్డ్‌మెడల్ దక్కగా, రాఘవ్ గోయల్ (చండీగఢ్), రిథమ్ కేడియా (ఛత్తీస్‌గఢ్)లకు సిల్వర్ మెడల్ దక్కాయి.
తొలి ఫ్యాక్ట్ చెకింగ్ బుక్
తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి బీ విజయ్‌సేన్ రెడ్డి జూలై 19న ఆవిష్కరించారు. ‘ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా?- చీఫ్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా’ అనే పుస్తకం తెలుగులో రావడం ఇదే ప్రథమం. సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్‌చెకర్ బీఎన్ సత్యప్రియ ఈ పుస్తకాన్ని రాశారు. తప్పుడు వార్తలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న తరుణంలో వాటిలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
నటేశ్వర శర్మ
ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య’ పురస్కారం 2023కు ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మకు లభించింది. రవీంద్రభారతిలో జూలై 22న నిర్వహించిన కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు ఈ అవార్డును అందజేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 1956, జూలై 17న జన్మించిన ఆయన పద్య, గేయ, వచన ప్రక్రియల్లో కవిత్వం రాశారు. 50కి పైగా కావ్యాలు ప్రచురించారు. ఆదిశంకరాచార్యులు రచించిన ‘సౌందర్యలహరి’పై చేసిన పరిశోధనకు 1994లో ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా, గోల్డ్‌మెడల్ అందుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రాచ్య విద్యాపరిషత్ కాలేజీ ప్రధానాచార్యులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 2011-2013లో ఓయూ ప్రాచ్య భాషా విభాగానికి డీన్‌గా వ్యవహరించారు. ఈ పురస్కారం కింద రూ.1,01,116 నగదును అందజేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?