Current Affairs | జాతీయం
యూనివర్సల్ పోస్టల్
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ప్రాంతీయ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. దీన్ని కమ్యూనికేషన్ల రాష్ట్ర మంత్రి దేవుసిన్హా చౌహాన్, యూపీయూ డైరెక్టర్ జనరల్ మసాహికో మెటోకి జూలై 19న ప్రారంభించారు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యూపీయూ సభ్యదేశాల మధ్య సహకారాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పోస్టల్ సేవలకు మెరుగుపరచడానికి, జ్ఞాన భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి కేంద్రంగా పని చేస్తుంది. యూపీయూ అభివృద్ధి, సాంకేతిక సహాయ కార్యకలాపాల కోసం నాలుగేండ్లకు 2 లక్షల డాలర్ల విరాళాన్ని భారతదేశం ప్రకటించింది.
జపాన్ రెండో క్వాడ్ దేశం
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ భారత్‌తో న్యూఢిల్లీలో జూలై 20న ఒప్పందం కుదుర్చుకుంది. కీలకమైన సెమీకండక్టర్ పరిశ్రమలో వరల్డ్ సప్లయ్ చైన్‌లో స్థితిస్థాపకతను పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యసుతోషి నిషిమురా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో అమెరికా తర్వాత భారత్‌తో చేతులు కలిపిన రెండో క్వాడ్ భాగస్వామి దేశంగా జపాన్ నిలిచింది.
నాలుగో ఎనర్జీ సదస్సు
నాలుగో, చివరి ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జీ20 భారత అధ్యతన గోవాలో నిర్వహించిన సమావేశం జూలై 20న ముగిసింది. రెండు రోజుల ఈ సదస్సులో జీ20 సభ్యదేశాలు, 9 ఆహ్వానిత దేశాల నుంచి 115 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ఇంధన పరివర్తనల సందర్భంలో వాతావరణ మార్పు, సుస్థిరత, ఇంధన భద్రత, ఈక్విటబుల్ ఎనర్జీ యాక్సెస్, ఫైనాన్సింగ్‌కు సంబంధించిన క్లిష్టమైన సవాళ్లపై చర్చించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?