Current Affairs March 22nd | క్రీడలు
కోహ్లీ
ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ మార్చి 12న సెంచరీ చేశాడు. దీంతో 75వ ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన కోహ్లీ.. సచిన్ (100) తర్వాత ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బ్యాటర్‌గానూ రికార్డులకెక్కాడు. 75వ సెంచరీకి సచిన్ 566 ఇన్నింగ్స్‌లు ఆడగా.. కోహ్లీ 552వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
- బోర్డర్-గవాస్కర్ టెస్టు ట్రోఫీని భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా నిలిచారు.స్వదేశంలో టెస్టుల్లో వేగంగా 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఘనత కోహ్లీ (77 ఇన్నింగ్స్) దక్కింది. సునీల్ గవాస్కర్ (87), ద్రవిడ్ (88)లను అధిగమించాడు.
వెర్స్టాపెన్
ఫార్ములా వన్ సీజన్ తొలి రేస్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రి మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. మార్చి 12న జరిగిన ఈ రేసులో వెర్స్టాపెన్ గెలువగా.. రెండో స్థానంలో సెర్గియో పెరెజ్, మూడో స్థానంలో ఫెర్నాండో అలాన్సో నిలిచారు.
బ్రెండా ఫ్రవిర్తోవా
ఐటీఎఫ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. మార్చి 12న బెంగళూరులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అంకిత రైనాను ఓడించింది.
అబ్దుల్
భారత ఐస్ స్కేటింగ్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ కోచ్‌గా మార్చి 13న ఎంపికయ్యాడు. సింగపూర్‌లో వచ్చే నెల 1, 2 తేదీల్లో జరిగే ఆసియా షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతున్న భారత టీమ్‌కు ఖాదిర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?