Current Affairs March 22nd | జాతీయం
ఐఎన్ఎస్ ద్రోణాచార్య
ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతాకను అందించారు. మార్చి 16న కొచ్చిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు.
టేకాఫ్ షాఫ్ట్
భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (తేజస్) స్వదేశీ పవర్ టేకాఫ్ (పీటీవో) షాఫ్ట్‌తో తొలిసారిగా మార్చి 14న గగన విహారం చేసింది. బెంగళూరులో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైంది. పీటీవో షాఫ్ట్.. చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్‌బాక్స్‌కు బదిలీ చేస్తుంది. దీన్ని విజయవంతంగా పరీక్షించడం ద్వారా అతికొద్ది దేశాలకే పరిమితమైన సంక్లిష్ట హైస్పీడ్ రోటర్ పరిజ్ఞానాన్ని భారత్ సముపార్జించినట్లయ్యింది.
వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్
గగనతల రక్షణకు ఉద్దేశించిన స్వల్ప శ్రేణి క్షిపణి (వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్) పరీక్షను మార్చి 14న భారత్ రెండు సార్లు విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగాలు చేపట్టారు. సైనికులు భుజం మీద మోసుకెళ్లే చిన్నపాటి లాంచర్ ద్వారా ఈ అస్ర్తాలను ప్రయోగించారు. తక్కువ ఎత్తులోని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ మిసైల్ వ్యవస్థను హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) రూపొందించింది.
కాలుష్య నగరాలు
కాలుష నగరాలకు సంబంధించి 2022 జాబితాను స్విస్ సంస్థ ఐక్యూ మార్చి 15న విడుదల చేసింది. దీనిలో మధ్య, దక్షిణాసియాల్లోని 15 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 12 భారత్‌కు చెందినవే ఉన్నాయి. దీనిలో మహారాష్ట్రలోని భివాండి అత్యంత కాలుష్యకారక నగరంగా నిలిచింది. దేశంలోని 60 శాతం నగరాలు 2.5 పీఎం స్థాయిలో ఉన్నాయని, ఇది డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్న ప్రపంచ స్థాయి కన్నా ఏడు రెట్లు అధికమని వెల్లడించింది. అదేవిధంగా అత్యంత కాలుష్య దేశాల్లో.. చాద్, ఇరాక్, పాకిస్థాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ 8వ స్థానంలో ఉంది. మెట్రో నగరాల్లో ఢిల్లీ 4వ స్థానంలో ఉండగా.. కోల్‌కతా (99), ముంబై (137), హైదరాబాద్ (199), బెంగళూరు (440), చెన్నై (682) స్థానాల్లో ఉన్నాయి.
రావత్ పేరిట అవార్డులు
దివంగత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్థం రెండు అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు నౌకాదళం మార్చి 16న ప్రకటించింది. దీనిలో ఒకటి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మహిళా అగ్నివీర్ ట్రెయినీకి ఇవ్వనున్నారు. మొదటి పురస్కారాన్ని మార్చి 28న ఐఎన్ఎస్ చిల్కాలో నిర్వహించే తొలి నేవీ అగ్నివీర్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అందజేయనున్నారు. రెండో పురస్కారం గోవాలోని నేవల్ వార్ కాలేజీలో ‘హయ్యర్ కమాండ్ కోర్స్’ శిక్షణ పొందుతున్నవారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారికి ఇవ్వనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?