March 22nd Current Affairs | అంతర్జాతీయం
ఆస్కార్ అవార్డులు
95వ ఆస్కార్ (అకాడమీ) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు.
ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్,
డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రేజర్ (ది వేల్)
ఉత్తమ నటి మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు: కీ హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి: జేమీ లీ కర్టిస్: (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఎంఎం కీరవాణి, చంద్రబోస్) (తెలుగు-భారత్)
ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
స్క్రీన్ ప్లే: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్
డాక్యుమెంటరీ షార్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ (భారత్).
తిరిగొచ్చిన వ్యోమగాములు
భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర (ఐఎస్ఎస్-ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో 5 నెలలు విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మార్చి 12న భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో 19 గంటలు ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్ర జలాల్లో దిగారు. వారిలో అమెరికాకు చెందిన నికోల్మన్, జోష్ కాసాడా, జపాన్‌కు చెందిన కోయిచీ వాకాటా, రష్యా కాస్మోనాట్ అన్నా కికినా ఉన్నారు.
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్
బహ్రెయిన్‌లోని మనామాలో నిర్వహిస్తున్న 146వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) సమావేశం మార్చి 15న ముగిసింది. ‘ప్రమోటింగ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ ఇన్‌క్లూజివ్ సొసైటీస్: ఫైటింగ్ ఇన్టోలరెన్స్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశం మార్చి 11న ప్రారంభమైంది. అంతర్జాతీయ భద్రత, శాంతి, సైబర్‌దాడులు, సైబర్ నేరాలపై చర్చించారు. భారత్ నుంచి ఈ సమావేశంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?