Current Affairs March 08 | క్రీడలు
మహిళల వరల్డ్ కప్
మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు 137 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు బెత్ మూనీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఆష్లే గార్డ్నర్లకు దక్కాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ విజేతగా నిలిచింది. ఇది రెండో హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు 2010, 12, 14లో వరుసగా వరల్డ్ కప్లను గెలుచుకుంది.
మెద్వెదెవ్
రష్యా ఆటగాడు ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని గెలుచుకున్నాడు. దోహాలో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆండీ ముర్రేను ఓడించాడు. ఈ టోర్నీతో అతడి కెరీర్లో 17 టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు రోటర్డామ్ టోర్నీని మెద్వదెవ్ గెలుచుకున్నాడు. దీంతో అతడి వరుస విజయాలు తొమ్మిదికి చేరుకున్నాయి.
నోరీ
బ్రిటన్ ఆటగాడు కామెరూన్ నోరీ రియో ఓపెన్ టెన్నిస్ టోర్నీని గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 26న రియో డి జనిరోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాప్సీడ్ కార్లోస్ అల్కారజ్ను ఓడించాడు. కెరీర్లో నోరీకిది ఐదో టైటిల్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?