March 08 Current Affairs | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
రష్మీ శుక్లా
సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా రష్మీ శుక్లా మార్చి 3న నియమితులయ్యారు. ఈమె 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ఆమె ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీగా ఉన్నారు.
బోలా టినుబు
నైజీరియా ప్రెసిడెంట్‌గా బోలా టినుబు (ఆల్ ప్రోగ్రెసివ్ కాంగ్రెస్) ఎన్నికయ్యారు. మార్చి 1న వెలువడిన ఫలితాల్లో ఆయనకు 37 శాతం ఓట్లు వచ్చాయి.
విశ్వనాథ్ సురేశ్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) డైరెక్టర్ (కమర్షియల్)గా విశ్వనాథ్ సురేశ్‌ను నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఈ పదవిలో ఐదేండ్లు ఉంటారు. ఆయన ఇదివరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
శైలేష్ పాఠక్
ఫిక్కీ కొత్త సెక్రటరీ జనరల్‌గా మాజీ ఐఏఎస్ అధికారి శైలేష్ పాఠక్ మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. ఈయన 37 ఏండ్ల ఉద్యోగ జీవితంలో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ప్రైవేట్ రంగంలోని పలు దిగ్గజ కంపెనీల్లోనూ పాఠక్ విధులు నిర్వర్తించారు.
చారుసిన్హా
సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్‌కు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా మార్చి 3న నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా రికార్డులకెక్కారు. ఆమె 1996 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి. జూబ్లీహిల్స్‌లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్హా సీఆర్పీఎఫ్ జమ్మూకు బదిలీ అయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?