Current Affairs April 05 | వార్తల్లో వ్యక్తులు
ఇషా అంబానీ
12వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులను మార్చి 24న ముంబైలో ప్రదానం చేశారు. దీనిలో ఇషా అంబానీ జనరేషన్ నెక్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందుకున్నారు. ఆమె రియల్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది సీఈవో అవార్డు సీకే వెంకటరామన్ (టైటాన్ ఎండీ), లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనిల్ మణిభాయి (ఏఎం) నాయక్ (ఎల్ అండ్ టీ), ఎమర్జింగ్ ఇన్నోవేటర్ అవార్డు పవన్ చందన, నాగభరత్ డాకా (స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు), టర్నరౌండ్ అవార్డు టాటా కమ్యూనికేషన్స్‌కు లభించాయి.
వెంకట్ నారాయణ్
విదేశీ విలేకరుల క్లబ్ (ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్-ఎఫ్‌సీసీ) దక్షిణాసియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట్ నారాయణ్ మార్చి 27న ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన అధ్యక్షుడిగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన 1968 నుంచి జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఆయన ఎఫ్‌సీసీ దక్షిణాసియా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ది సండే టైమ్స్, బోస్టన్ గ్లోబ్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశారు.
అజయ్ సింగ్
అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా అజయ్ సింగ్ మార్చి 29న బాధ్యతలు చేపట్టారు. ఆయన స్పైస్‌జెట్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అసోచామ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ నియమితులయ్యారు.
సెయిచీ సానో
జపాన్‌లోని ఫుజిసవా నగరానికి చెందిన సెయిచీ సానో సర్ఫింగ్ చేస్తున్న ప్రపంచంలో అత్యధిక వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ మార్చి 30న గుర్తింపు పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఈ ఏడాదిలో 90 ఏండ్ల వయస్సుకు చేరనున్నారు. ఆయన 80 ఏండ్ల వయస్సు నుంచే సర్ఫింగ్ చేయడం మొదలుపెట్టారు.
షేక్ ఖాలిద్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువరాజుగా షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (41) మార్చి 30న నియమితులయ్యారు. ఆయన యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పెద్ద కుమారుడు. షేక్ ఖాలిద్ 2016 నుంచి ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?