Current Affairs May 10 | క్రీడలు
క్రీడలు
సాత్విక్-చిరాగ్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించింది. దుబాయ్‌లో ఏప్రిల్ 30న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంగ్ యేవ్ సిన్-టియో యీ (మలేషియా)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. గతంలో దినేశ్ ఖన్నా 1965లో పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. 1971లో డబుల్స్‌లో దీపు ఘోష్-రమన్ ఘోష్ జంట కాంస్యం గెలిచింది. మళ్లీ ఇన్నేండ్ల తరువాత భారత జోడీ డబుల్స్‌లో పతకం సాధించింది.
సుమిత్ నాగల్
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ రోమ్ ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రోమ్‌లో ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్‌లో డచ్ క్రీడాకారుడు జెస్పర్ డి జోంగ్‌పై విజయం సాధించాడు. యూరోపియన్ క్లే కోర్టులో ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా నాగల్ రికార్డు సృష్టించాడు. నాగల్‌కు కెరీర్లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టైటిల్.
డింగ్ లిరెన్
చైనా చెస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ప్రపంచ చెస్ టైటిల్‌ను గెలిచాడు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్‌లో రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నిపోమ్నియాషిపై విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ విజేత అయ్యింది డింగ్ లిరెన్ మాత్రమే.
రొనాల్డో
అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడని ఫోర్బ్స్ మే 3న వెల్లడించింది. రొనాల్డో ఇటీవల అరేబియా క్లబ్ అల్‌నాసర్‌కు మారిన తరువాత మూడేండ్ల కాలానికి 136 మిలియన్ డాలర్లకు పెరిగింది. పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్‌కు చెందిన లియోనల్ మెస్సీ (130 మిలియన్ డాలర్లు), కలియన్ ఎంబాపె (110 మిలియన్ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
షబ్నిమ్ ఇస్మాయిల్
మహిళా క్రికెటర్లలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరుపొందిన సౌతాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 3న రిటైర్మెంట్ ప్రకటించింది. 34 ఏండ్ల షబ్నిమ్ వన్డే, టీ20, టెస్టులతో సహా అన్ని ఫార్మాట్లలో కలిపి 241 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2007లో క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె తన కెరీర్లో 317 వికెట్లు పడగొట్టింది.
జెఫ్రీ ఇమాన్యుయేల్
భారత్‌కు చెందిన 18 ఏండ్ల జెఫ్రీ ఇమాన్యుయేల్ మే 5 నుంచి 7 వరకు జరిగిన ఎఫ్ఐఎం వరల్డ్ జూనియర్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు. దీంతో గ్రాండ్ ప్రిక్స్ రేసులో పాల్గొన్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఈ గ్రాండ్ ప్రిక్స్ పోర్చుగల్‌లో నిర్వహించారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?