Current Affairs May 10 | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
భీమ్స్ సిసిరోలియో
‘బలగం’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. మే 1న నిర్వహించిన 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ పురస్కారం దక్కింది. అదేవిధంగా ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిలిం అవార్డ్స్‌లో ఈ సినిమాకు బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం విభాగంలో అవార్డు లభించింది. అమెరికాలోని లాస్ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు (ఎల్ఏసీఏ-లాకా) అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డులు దక్కాయి.
అరుణ్ గాంధీ
ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మే 2న మరణించారు. 1934, ఏప్రిల్ 14న సౌతాఫ్రికాలోని డర్బన్‌లో మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్ గాంధీ, సుశీల మష్రూవాలా దంపతులకు జన్మించారు. 1987లో కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడిన ఆయన అక్కడ ఓ యూనివర్సిటీలో ఎంకే గాంధీ ఇన్స్టిట్యూట్ పేరుతో అహింసకు సంబంధించిన సంస్థను స్థాపించారు. ‘ది గిఫ్ట్ ఆఫ్ యాంగర్’, అదర్ లెసన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మహాత్మా గాంధీ’ అనే పుస్తకాలు రచించారు. ఆయన జర్నలిస్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?