నార్మ్ కు సర్దార్ పటేల్ జాతీయ పురస్కారం (తెలంగాణ)
నార్మ్ కు అవార్డు
రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (ఎన్‌ఏఏఆర్‌ఎం-నార్మ్)కు సర్దార్ పటేల్ జాతీయ పురస్కారం లభించింది. జూలై 16న ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును నార్మ్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు అందజేశారు. దేశవ్యాప్తంగా ఐసీఏఆర్‌కు చెందిన వ్యవసాయ పరిశోధన సంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు నార్మ్‌కు ఈ పురస్కారం దక్కింది.
డిక్కీ బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్
సైఫాబాద్‌లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ-డిక్కీ) ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్, మోడల్ కెరీర్ సెంటర్‌ను జూలై 20న ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టీ ప్రైడ్ పథకం ద్వారా ఇప్పటివరకు ఎస్సీలకు చెందిన 21,500 యూనిట్లకు రూ.1,005 కోట్లు, ఎస్టీలకు చెందిన 25,560 యూనిట్లకు రూ.1,133 కోట్ల ప్రోత్సాహకాలను అందజేశామని మంత్రి వెల్లడించారు. డిక్కీని 2005లో మిలింద్ కాంబ్లీ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పుణెలో ఉంది. దీని నినాదం ‘బీ జాబ్ గివ్స్-నాట్ జాబ్ సీకర్స్’.
– ప్రభుత్వం 53 కార్పొరేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. 26 కొత్త సంస్థలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణపై టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఆయా సంస్థల ప్రతినిధులు జూలై 20న ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.
తెలంగాణ నంబర్-2
నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (ఆవిష్కరణల సూచీ)లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచీని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సీఈవో పరమేశ్వరన్ జూలై 21న విడుదల చేశారు. ఈ సూచీలో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది.
హర్యానా 3, మహారాష్ట్ర 4, తమిళనాడు 5, పంజాబ్ 6, ఉత్తరప్రదేశ్ 7, కేరళ 8, ఆంధ్రప్రదేశ్ 9, జారండ్ 10, పశ్చిమ బెంగాల్ 11, రాజస్థాన్ 12, మధ్యప్రదేశ్ 13, గుజరాత్ 14, బీహార్ 15, ఒడిశా 16, ఛత్తీస్‌గఢ్ 17వ స్థానాల్లో నిలిచాయి.
వేణు సంకోజుకు అవార్డు
నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు వేణు సంకోజు 2022కు దాశరథి అవార్డు జూలై 22 (దాశరథి జయంతి)న అందుకున్నారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపిక అందజేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేణు కవితలు, కథలు, వ్యాసా లు, గ్రంథాలు రాశారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?