సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీగెలిచిన భారతీయ క్రీడాకారిణి ? ( క్రీడలు)

పీవీ సింధు
సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయం సాధించింది. జూలై 17న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై గెలుపొందింది. ఈ సింగపూర్ టైటిల్‌ను సింధు గెలవడం ఇదే మొదటిసారి.
కార్తిక్-మనీశ్
ఐటీఎఫ్ మెన్స్ 15000 డాలర్ల టెన్నిస్ టోర్నీలో సాయి కార్తిక్-మనీశ్ జోడీ విజేతగా నిలిచింది. జూలై 17న ట్యునీషియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన నిక్కీ-రిత్విక్ జోడీపై గెలిచింది. తొలి ఐటీఎఫ్ సాధించిన కార్తిక్ తెలంగాణకు చెందిన క్రీడాకారుడు.
రామ్‌దిన్, సిమన్స్
వెస్టిండీస్ క్రికెటర్లు లెండిల్ సిమన్స్, దినేశ్ రామ్‌దిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు జూలై 19న రిటైర్మెంట్ ప్రకటించారు. సిమన్స్ 2006లో క్రికెట్లోకి ప్రవేశించాడు. 8 టెస్టుల్లో 278, 68 వన్డేల్లో 1958, 68 టీ20ల్లో 1527, 29 ఐపీఎల్లో 1079 పరుగులు చేశాడు.
రామ్‌దిన్ 2005లో క్రికెట్లోకి ప్రవేశించాడు. 74 టెస్టుల్లో 2898, 139 వన్డేల్లో 2200, 71 టీ20ల్లో 636 పరుగులు చేశాడు.
లీటన్ హెవిట్
ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ ప్రపంచ మాజీ నంబర్-1 ఆటగాడు లీటన్ హెవిట్ ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలోకి జూలై 16న చేరాడు. లీటన్ 30 ఏటీపీ, 2001 యూఎస్ ఓపెన్, 2002 వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు.
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్‌లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్‌లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు