వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన మస్కట్ పేరు? ( జాతీయం)
జాగృతి
వినియోగదారుల వ్యవహారాల శాఖ (డీఓసీఏ) రూపొందించిన ‘జాగృతి’ అనే మస్కట్‌ను జూలై 15న ప్రారంభించారు. వినియోగదారుల సాధికారత, హక్కులపై అవగాహన కల్పించేందుకు దీనిని రూపొందించారు. దీని ట్యాగ్‌లైన్ ‘జాగో గ్రాహక్ జాగో’.
ఐఎన్ఎస్ సింధుధ్వజ్
ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ సింధుధ్వజ్ జలాంతర్గామికి జూలై 16న వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జలాంతర్గామి భారత నౌకాదళం విజయాల్లో కీలక పాత్ర పోషించి 35 ఏండ్లు సేవలందించింది. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్గా పరిగణిస్తారు.
స్ప్రింట్ చాలెంజెస్
భారత నౌకాదళంలో స్వదేశీ సాంకేతికత వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘స్ప్రింట్ చాలెంజెస్’ను ప్రధాని మోదీ జూలై 18న ఆవిష్కరించారు. నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండినైజేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఐఓ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) సంయుక్తంగా న్యూఢిల్లీలో నిర్వహించిన స్వావలంబన్ సదస్సులో భాగంగా దీనిని ప్రారంభించారు.
ఎఫ్/ఎ-18
అమెరికాకు చెందిన రెండు ఎఫ్/ఎ-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని జూలై 20న గోవాలోని హన్సా నౌకాదళ కేంద్రంలో ప్రదర్శించి చూసింది. యూఎస్ఏ దిగ్గజ సంస్థ బోయింగ్ తయారుచేసిన ఈ యుద్ధ విమానాలు భారత నౌకాదళానికి బాగా ఉపయోగపడుతాయని నిరూపించేందుకు పలు రకాల విన్యాసాలు చేయించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?