ఆరోగ్యం కోసం శాంతి – శాంతి కోసం ఆరోగ్యం
కరెంట్ అఫైర్స్ రౌండప్2022
స్టాక్ హోమ్ ప్లస్ 50 వాతావరణ సదస్సు
– స్టాక్ హోమ్ ప్లస్ 50 సదస్సును 2022 జూన్ 2 – 3 తేదీలలో స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఎజెండా-2030లోని లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– భూగోళం మీద వాతావరణ మార్పులు, కాలుష్యం, వ్యర్థాలు ఈ మూడూ బాగా పెరిగిపోయి ప్రకృతి వనరులకు, జీవవైవిధ్యానికి భారీగా నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
-1968వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా వాతావరణ మార్పుల అంశం పై చర్చ జరిగింది.
– ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై శాస్త్రీయమైన రుజువులు లభించడం వల్ల ఆ అంశంపై ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం తప్పనిసరి అని భావించి స్టాక్ హోమ్ సదస్సును నిర్వహించారు. దీన్ని మొట్టమొదట స్వీడన్ దేశం ప్రతిపాదించింది. అందుకే దీన్ని ‘స్వీడిష్ ఇనీషియేటివ్’ అని కూడా పిలుస్తారు. ఇది స్టాక్ హోమ్‌లో జరిగింది కాబట్టి స్టాక్ హోమ్ సదస్సు అని కూడా పిలుస్తారు.
– ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మొట్టమొదటగా మానవ పర్యావరణం, భూ వాతావరణం ప్రధానాంశాలుగా ఈ స్టాక్ హోమ్ సదస్సు 1972, జూన్ 5 -16 తేదీల మధ్య జరిగింది. దీని నినాదం – ‘ఒక్కటే భూగోళం’
ప్రధానాంశాలు
-ప్రస్తుత తరం, భవిష్యత్ తరాల ప్రయోజనాలు కాపాడటం కోసం గాలి, నీరు, భూమి, వృక్షాలు, జీవజాలం మొదలైన ప్రకృతి వనరులను జాగ్రత్తగా పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సదస్సులో నిర్ణయించారు.
-వాతావరణం దెబ్బ తినే ప్రమాదం కలిగిన విషవూరిత పదార్థాలు, ఉష్ణోగ్రతలను బయటకు నేరుగా విదల చేయకూడదని నిర్ణయించారు.
– వర్ధమాన, పేద దేశాలు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో పెద్ద దేశాలు సహాయం అందించాలని నిర్ణయించారు.
ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 75వ సమావేశం
-ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 75వ సమావేశం 2022 మే 22-28 మధ్య స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. దీనికి భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హాజరయ్యారు.
-ఈ సమావేశంలో ఆయన మాట్లాతూ అంతర్జాతీయంగా ఆరోగ్య రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని మరింత పకడ్బందీగా రూపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశ నినాదం: ‘ఆరోగ్యం కోసం శాంతి -శాంతి కోసం ఆరోగ్యం.
(Health for peace, peace for health)
భారత ఆరోగ్య శాఖ మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు..
– ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్లు, ఇత మందులకు అనుమతులు ఇచ్చే విధానాన్ని మెరుగు పరచడం. తద్వారా అంతర్జాతీయ ఆరోగ్య భద్రతా వ్యవస్థలో మరిన్ని వెసులుబాట్లు ఏర్పాటు చేయడం.
-వ్యాక్సిన్లు, ఔషధాలు, మేధోసంపత్తి అంశాలకు సంబంధించి అన్ని దేశాలకు సమాన అవకాశాలు ఇవ్వడం.
-చవకగా పరిశోధనలు, సాంకేతిక బదిలీ, ప్రాంతీయ తయారీ సామర్థ్యాలు మొదలైన వాటికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం.
-ఈ అంశంపై భారత రిజిస్ట్రార్ జనరల్ పౌర రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా విడుదల చేసిన కచ్చితమైన, ప్రత్యేకమైన సమాచారాన్ని పరిశీలించాలని భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది.
– గణిత పద్ధతుల ప్రకారం సేకరించిన సమాచారంపై రూపొందించిన అంచనాలను పరిగణనలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు. అందుకే ఆరోగ్య, కుటుంబ సంక్షేమాల కేంద్ర మండలి (రాజ్యాంగంలోని అధికరణ 263 కింద ఏర్పాటైంది) ఈ అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విధానాలను నిరసిస్తూ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
‘భారీ రేడియో టెలిస్కోప్’లో భారత్
స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ పేరు గల ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ పైన భారీ సైన్స్ ప్రాజెక్టు కోసం పనిచేసేందుకు 2022 ఫిబ్రవరిలో భారత్ ఒక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత్ నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎస్ఆర్)- జాతీయ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రం (ఎన్సీఆర్ఏ), ఎస్కేఏ ప్రతినిధులు సంతకాలు చేశారు.
‘ఎడారీకరణ’ పై యూఎన్ఓ సదస్సు
-ఐక్యరాజ్య సమితి ఏడారీకరణను ఎదుర్కొనే కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ లేదా యూఎన్‌సీసీడీ) సభ్యదేశాల 15వ సమావేశం (కాప్-15) 2022, మే నెల రెండో వారంలో పశ్చిమ ఆఫ్రికాలోని ‘కోటె డి ఐవరీ’ దేశంలో జరిగింది. దీనికి భారత పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి హాజరయ్యారు.
ఈ సమావేశ నినాదం- ‘‘ భూమి- జీవితం- కొరత నుంచి సుసంపన్నత వరకు’’
– ఈ సమావేశంలో ప్రధానంగా ఎడారీకరణ, నేల దెబ్బ తినడం, కరవుపై పోరాటం తదితర అంశాల గురించి చర్చించారు. యూఎన్‌సీసీడీ విడుదల చేసిన ‘ప్రపంచ భూ స్థితిగతుల’పై రెండో నివేదికలోని అంశాల గురించి, దానికి సంబంధించి భూమి దెబ్బతినడం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం మొదలైన అంశాల గురించి కూడా చర్చలు జరిగాయి.
– పై నివేదిక ప్రపంచవ్యాప్తంగా భూ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించింది. సుస్థిరమైన పద్ధతిలో ఉండేలా భూమి, జల నిర్వహణ గురించిన విధానాలు, పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం గురించి వివరించింది.
-ఇంకా ఈ సమావేశంలో కరువులు, భూమి పునరుద్ధరణ, భూ హక్కులు, లింగ సమానత్వం, యువత సాధికారత మొదలైన అంశాల గురించి చర్చించారు.
ఎడారీకరణ
-భూమి లోపల జీవ సంబంధిత, ఆర్థిక సంబంధిత ఉత్పాదకత తగ్గిపోయి పొడి నేలలుగా మారడాన్ని భూమి దెబ్బ తినడం లేదా ఎడారీకరణగా పేర్కొంటారు.
– పొడిగా, కొద్దిగా తేమగా ఉండే ప్రాంతాల వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాలు, ఇతర వివిధ కారణాల వల్ల భూమి బాగా దెబ్బ తినడాన్ని కూడా ఎడారీకరణ అంటారు.
– భూమి పై పొరలు దెబ్బ తినడం, ముఖ్యంగా వర్షాలు, వరదల కారణంగా పై పొరలు కొట్టుకుపోవడం ఎడారీకరణకు ప్రధాన కారణం.
పశ్చిమ సెతి జలవిద్యుత్ ప్రాజెక్టు
ప్రస్తుతం దేశంలో భూమి దెబ్బ తినడం, ఎడారీకరణలకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు
-సమీకృత వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం- ఐడబ్ల్యూఎంపీ (ప్రధానమంత్రి కృషి సించాయి యోజన)
-జాతీయ అడవుల పెంపకం కార్యక్రమం – ఎన్ఏపీ
-హరిత భారతం కోసం జాతీయ మిషన్ – జీఐఎం
– మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
-నదీ లోయల క్యాచ్మెంట్ ప్రాంతాల్లో నేలల పరిరక్షణ ప్రాజెక్ట్
-వర్షాధార ప్రాంతాల్లో జాతీయ వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్ట్
-పశుగ్రాస అభివృద్ధి పథకం- పచ్చిక మైదానాలు, పచ్చిక నేలల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా
కమాండ్ ఏరియా అభివృద్ధి, జల నిర్వహణ కార్యక్రమం
-నేల ఆరోగ్య కార్డు (సాయిల్ హెల్త్ కార్డ్) పథకం
-నేపాల్‌లోని పశ్చిమ సెతి జల విద్యుత్ ప్రాజెక్టును తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు 2022 జూన్ మూడవ వారంలో భారత్ ప్రకటించింది. ఇంతకు ముందు అంటే 2012 -2018 సంవత్సరాల మధ్య ఆరేళ్ల పాటు ఈ ప్రాజెక్టు చైనా అధీనంలో ఉంది. 2018లో చైనా దీని నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. తర్వాత నాలుగేళ్లకు భారత్ దీని నిర్వహణ జరపనున్నట్లు ప్రకటించింది.
పశ్చిమ సితి జల విద్యుత్ ప్రాజెక్టు
-నేపాల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న సెతి నది మీద నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాజెక్టు.
– ఇక్కడ 750 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు.
– ఇది గత ఆరు దశాబ్దాలుగా ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది.
– ఇటీవల దీన్ని భారత ప్రభుత్వం పశ్చిమ సైతి – సెతి నదీ ప్రాజెక్టు’ పేరుతో ఉమ్మడి నీటి నిల్వ రిజర్వాయర్గానూ, 1200 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుగానూ మార్పు చేసింది.
-ఈ రిజర్వాయర్‌లో రుతుపవనాల సమయంలో నీటిని నింపి పొడిగా ఉండే వేసవి సమయాల్లో దాని నుంచి విద్యుదుత్పాదన చేయాలని నిర్ణయించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?