Current Affairs | శ్రామిక్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
కరెంట్ అఫైర్స్
1. “చాచా చౌదరి ఔర్ చునావి దంగల్” అనే ప్రచార కార్యక్రమం ఎవరు ప్రారంభించారు?
ఎ. కేంద్ర ఆర్థిక శాఖ
బి. కేంద్ర ఎన్నికల సంఘం
సి. నీతి ఆయోగ్
డి. జాతీయ మహిళా కమిషన్
2. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2023 గురించి సరైన వాక్యమేది?
1. దీన్ని 135 దేశాల్లో నిర్వహించారు
2. భారతదేశం 40వ స్థానం పొందింది
3. దీన్ని ప్రపంచ మేధో హక్కుల సంపత్తి సంస్థ విడుదల చేస్తుంది
4. భారతదేశం 2015లో 81వ స్థానంలో ఉంది
ఎ. 2, 3, 4 బి. 1, 2, 3, 4
సి. 1, 3, 4 డి. 2, 4
3. 2024 ఆస్కార్ అవార్డ్లకు భారతదేశం నుంచి నామినేట్ అయిన సినిమా గురించి సరికాని వాక్యమేది?
1. దీనికి 2018 : ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో అనే సినిమా నామినేట్ అయింది
2. ఈ సినిమా ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీకి నామినేట్ అయింది
3. ఈ సినిమా తమిళ భాషా సినిమా
4. ఇప్పటి వరకూ ఈ కేటగిరిలో భారత్ రెండు అవార్డులు పొందింది.
ఎ. 1, 2, 3, 4 బి. 1, 2, 3
సి. 1, 2 డి. 2, 3, 4
4. సెప్టెంబర్ 27, 2023న టి-20 క్రికెట్లో నేషనల్ జట్టు అవార్డు సాధించిన ప్రపంచ రికార్డ్‌లు.
1. టి-20లో క్రికెట్లో అత్యధిక జట్టు స్కోరు
2. టి-20 లో క్రికెట్లో వేగవంతమైన అర్థసెంచరీ, సెంచరీలు నమోదు
3. టి-20 లో క్రికెట్లో పరుగులు పరంగా పెద్ద విజయం
4. ఈ రికార్డులు అఫ్గానిస్థాన్ జట్టుపై సాధించింది.
ఎ. 1, 2, 3, 4 బి. 1, 3, 4
సి. 2, 3, 4 డి. 1, 2, 3
5. 2023 ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత జాతీయ పతాక ధారులు
ఎ. మన్ ప్రీత్ సింగ్, పి.వి. సింధు
బి. బైచూగ్ భూటియా, మన్ ప్రీత్ సింగ్
సి. బైచుంగ్ భూటియా, పి.వి. సింధు
డి. మన్ ప్రీత్ సింగ్, లవ్లీనా బార్గో హెయిన్
6. ఆహార భద్రత, పోషణ, వాతావరణ స్థితి స్థాపకత, జీవనంపై పరస్పర సహకారం కోసం ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) కింది దేనితో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొంది.
ఎ.IIT బొంబాయి బి. IIT మద్రాస్
సి. IIT ఢిల్లీ డి. IIT ఖరగ్ పూర్
7. భారతదేశ చిత్రకారిణి అమృతా షెర్గిల్ వేసిన కళాఖండం ఇటీవల జరిగిన వేలం పాటలో రూ. 61.8 కోట్లకు అమ్ముడైంది. ఇది భారతదేశ చరిత్రలో అత్యధిక ధర. ఆమె వేసిన ఆ చిత్రం పేరు?
ఎ. త్రీ గర్ల్స్ బి. ది స్టోరీ టెల్స్
సి. యంగ్ గర్ల్స్ డి. హిల్ ఉమెన్
8. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16, 2023 నాటికి వసూలైన నికర ప్రత్యక్ష పన్నుల గురించి సరికానిది.
ఎ. మొత్తం వసూలైన నికర ప్రత్యక్ష పన్నుల విలువ రూ. 8,65,117 కోట్లు
బి. ఇది వార్షిక ప్రాతిపదికన 23.51% పెరిగింది.
సి. కార్పోరేట్ల నుంచి అధికంగా ముందస్తు పన్ను వసూళ్ల కారణంగా వృద్ధి పెరిగింది.
డి. ఇప్పటి వరకూ రూ. 1.22 కోట్ల రిఫండ్లను కేంద్రం సర్దుబాటు చేసింది.
9. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గురించి సరైన వాక్యమేది?
1. ఇది భారదేశంలో అత్యున్నత సినీరంగ పురస్కారం
2. 2021 సంవత్సరానికి ఆశా పరేఖ్ కి ప్రకటించారు
3. 2022 సంవత్సరానికి వహీదా రెహ్మాన్‌కి ప్రకటించారు
4. దీని 50వ అవార్డ్‌ను అమితాబ్‌బచ్చన్‌కి ప్రదానం చేశారు
ఎ. 1, 2, 3 బి. 1, 3, 4
సి. 1, 4 డి. 2, 3, 4
10. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ – 2022 కి సంబంధించనిది?
ఎ. వీటిని మొత్తంగా 12 మందికి ప్రకటించారు
బి. వీటిని ఏడు రంగాల్లో ఇస్తారు.
సి. 2022 అవార్డుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
డి. 45 సంవత్సకరాల వయసు వరకూ ఉన్న శాస్త్రవేత్తలకి దీన్ని ఇస్తారు
11. రైల్వే బోర్డ్ ఛైర్ పర్సన్‌గా ఎంపికైన జయవర్మ సిన్హా గురించి సరికాని వాక్యమేది?
ఎ. రైల్వే బోర్డ్‌కి తొలి మహిళా ఛైర్ పర్సన్
బి. ఈమె అనిల్ కుమార్ లహోటి స్థానంలో ఎన్నికయ్యారు
సి. ఈమె బంగ్లాదేశ్‌లో రైల్వే సలహాదారుగా పనిచేశారు
డి. ఈమె సమయంలో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య మిధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారు.
12. ఐసిసి వన్డే క్రికెట్ ప్రపంచకప్ – 2023 అధికారిక గీతం “దిల్ జష్న్ బోలే” సంగీతాన్ని అందించింది.
ఎ. ఎ.ఆర్. రెహమాన్
బి. ప్రీతమ్
సి. శంకర్ – ఎహ్సాన్-లాయ్
డి. శివమణి
13. యూఎస్ ఓపెన్ – 2023 గురించి సరైన వాక్యం?
1. మహిళల సింగిల్స్ విజేత కొకొగాఫ్
2. పురుషుల సింగిల్స్ రన్నరప్ నోవాక్ జుకోవిచ్
3. పురుషుల డబుల్స్ రన్నరప్స్ రోహన్ బో పన్న, మాధ్యూ ఎబ్డెన్
4. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచింది నోవాఖ జుకోవిచ్
ఎ. 1, 2, 3 బి. 3, 4
సి. 1, 2, 3 డి. 1, 3. 4
14. 1. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ICCC) 2023 సమావేశం థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగింది
2. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ICCC) 2023 సమావేశం భారత్‌లో జరగనుంది
3. భారతదేశంలో ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి
పై వాక్యాల్లో సరైనది.
ఎ. 1, 2, 3 బి. 1, 3
సి. 2, 3 డి. 1, 2
15. ఇండియా గ్లోబల్ ఫోరమ్, వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం దేనిపై జరిగింది?
ఎ. ఆర్థిక సహకారంపై
బి. రక్షణ సహకారంపై
సి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిపై
డి. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిపై
16. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్కి సంబంధించి సరైనది?
1.దీన్ని సైన్స్, టెక్నాలజీ, నవకల్పన రంగాల్లో ఇస్తారు
2. ఇది నాలుగు రంగాల్లో ఇస్తారు
3. దీనికి నగదు బహుమతి లేదు.
4. 17 మంది సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది?
ఎ. 1, 2, 4 బి. 2, 3, 4
సి. 1, 2, 3, 4 డి. 2, 4
17. సెప్టెంబర్ 21, 2023న విడుదల చేసిన పి.ఎం కిసాన్ A-I చాట్ బాట్ పేరు?
ఎ. కిసాన్ e-మిత్ర
బి. కిసాన్ e-సహాయ్
సి. కిసాన్ e- వ్యవసాయ్
డి. కిసాన్ e- ఆహార్
18. జైల్లో ఉన్న గర్భిణులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సెప్టెంబర్ 21, 2023న పార్లమెంట్‌కి నివేదిక సమర్పించిన పార్లమెంటరీ ప్యానల్ చైర్మన్ ఎవరు?
ఎ. నరేష్ చంద్ర బి. బ్రిజ్‌లాల్
సి. శశిధరూర్ డి. జౌల్డరమ్
19. ప్రపంచ క్రికెట్లో మూడు ఫార్మాట్ల్లో ఒకేసారి నంబర్-1 ర్యాంక్ సాధించిన రెండవ జట్టు భారతదేశం కాగా, మొదటి జట్టు ఏది?
ఎ. ఆస్ట్రేలియా బి. ఇంగ్లండ్
సి. పాకిస్థాన్ డి. దక్షిణాఫ్రికా
20. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందించినప్పుడు ఏడు సూచనలు చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్
ఎ. గీతాగోపీనాధ్ బి. గీతాదాస్
సి. గీతాదేవి డి. గీతా ముఖర్జీ
21. సెప్టెంబర్ 21, 2023 న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తొలిసారిగా అందరూ మహిళా వైస్ చైర్ పర్సన్లుగా ఉన్న ప్యానల్ ఏర్పాటు చేశారు. ఇది ఎంతమందితో ఏర్పడింది.
ఎ. 13 బి. 14
సి. 12 డి. 11
22. ఆర్థిక స్వేచ్ఛా సూచీ -2023లో అగ్రస్థానం పొందిన దేశాలు వరుసగా
ఎ. సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, యు.ఎస్.ఎ, న్యూజిలాండ్
బి. సింగపూర్, హాంకాంగ్, యు.ఎస్.ఎ, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్
సి. సింగపూర్, హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యు.ఎస్.ఎ
డి. సింగపూర్ స్విట్జర్లాండ్, యు.ఎస్.ఎ, న్యూజిలాండ్, హాంకాంగ్
23. సింబెక్స్ – 2023 గురించి సరైంది?
1. ఇవి భారత్, సింగపూర్ల మధ్య జరిగే విన్యాసాలు
2. ఇవి వైమానిక దళ విన్యాసాలు
3. ఇవి 1994లో ప్రారంభమమయ్యాయి.
4. ఇవి 2023లో భారత్‌లో జరిగాయి
ఎ. 1, 2, 3 బి. 1, 3
సి. 2, 3 డి. 2, 3, 4
24. ఆసియా కప్- 2023 గురించి సరైన వాక్యం? (క్రికెట్)
1. ఇది 16వ సీజన్
2. దీన్ని పాకిస్థాన్, శ్రీలంకలు నిర్వహించాయి
3. ఇందులో 6 జట్లు పాల్గొన్నాయి. నేపాల్ తొలిసారి పాల్గొంది.
4. విజేత భారతదేశం కాగా పరాజిత శ్రీలంక
ఎ. 1, 2, 3, 4 బి. 2, 3, 4
సి. 1, 2, 3 డి. 2, 3
25. ముఖ్యమంత్రి శ్రామిక్ కల్యాణ్ యోజన పథకంను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. అరుణాచల్ ప్రదేశ్ బి. అస్సాం
సి. హిమాచల్‌ప్రదేశ్ డి. మిజోరాం
26. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ -2024లో భారత నుంచి అగ్రస్థానం పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ
ఎ. IIT ఢిలీ బి. IISC, బెంగుళూరు
సి. IIT బెంగుళూరు డి. IIT మద్రాస్
27. “నర్వాల్” పేరుతో సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకొన్న జలాంతర్గామిని విడుదల చేసిన దేశం?
ఎ. చైనా బి. హాంకాంగ్
సి. మాల్దీవులు డి. తైవాన్
28. భారత్- అమెరికా 2+2 సమావేశం వాషింగ్టన్ డి.సిలో జరిగింది. అయితే 2+2 అనేది రెండు మంత్రిత్వ శాఖలను తెలియజేస్తాయి. ఆ రెండు శాఖలు ఏవి?
ఎ. రక్షణశాఖ, ఆర్థిక శాఖ
బి. ఆర్థికశాఖ, విదేశాంగశాఖ
సి. రక్షణశాఖ, విదేశాంగశాఖ
డి. విదేశాంగశాఖ, రవాణాశాఖ
29. 2023లో జరిగిన G-20 సమావేశం ఇతి వృత్తం “ఒకభూమి- ఒక కుటుంబం – ఒక భవిష్యత్”ను ఎక్కడి నుంచి తీసుకున్నారు?
ఎ. మాండకోపనిషత్
బి. మహోపనిషత్
సి. చంద్యోగోపనిషత్ డి. కేనోపనిషత్
30. సెప్టెంబర్ 25, 2023 న కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తందాస్ రూపాలో ఆధునీకరించిన మెరైన్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబాయి బి. కాండ్లా
సి. విశాఖపట్టణం డి. చెన్నై
సమాధానాలు
1-బి 2-ఎ 3-సి 4-డి
5-డి 6-ఎ 7-బి 8-ఎ
9-సి 10-సి 11-డి 12-బి
13-డి 14-ఎ 15-సి 16-సి
17-ఎ 18-బి 18-బి 19-డి
20-డి 21-ఎ 22-డి 23-మ
24-ఎ 25-ఎ 26-బి 27-డి
28-సి 29-బి 30-సి
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
91107 62187
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?