Current Affairs March 22nd | తెలంగాణ
రైజింగ్ డే
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్ డే)ను మార్చి 12న నిర్వహించారు. హైదరాబాద్ హకీంపేట ఎయిర్‌ఫోర్స్ సెంటర్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో నిర్వహించిన ఈ రైజింగ్ డేలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సెంటినల్-2023 పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎన్ఐఆర్డీ-ఇక్రిశాట్
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ-జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ), ఇక్రిశాట్ మార్చి 13న అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో మెట్టపంటల్లో అధిక ఉత్పాదకత, ఆహారభద్రత సాధన కోసం కలిసి పనిచేయడం ఈ ఒప్పందం లక్ష్యం. అదేవిధంగా వాతావరణ మార్పుల అనుసరణ, గ్రామీణ వ్యవస్థాపకతలో అభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా ప్రోత్సాహం, మహిళా సంఘాల ద్వారా వ్యాపారం, అధిక దిగుబడినిచ్చే వంగడాలపై పరిశోధన, అభివృద్ధికి కృషి చేస్తాయి. ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ జీ నరేంద్రకుమార్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హుజెస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 2023కు స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్’ అవార్డు మార్చి 16న లభించింది. భారత్‌తో పాటు దక్షిణాసియాలోనే ఈ ఎయిర్పోర్ట్ నిలిచింది. దీంతో పాటు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు కూడా దక్కింది.
కర్ర పెన్ను
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కుదురుపాక జగదీశ్వర్ తయారు చేసిన కర్ర పెన్నుకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మార్చి 16న చోటు లభించింది. టేకు కర్రతో తయారు చేసిన ఈ పెన్ను 27.9 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంది. దీనికి రూ.25 వేల ఖర్చు అయ్యిందని జగదీశ్వర్ వెల్లడించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?