Current Affairs April 12 | జాతీయం

పునర్వినియోగ రాకెట్
- రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్ వీఎల్ఈఎక్స్)ను ఇస్రో ఏప్రిల్ 2న విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఈ పరీక్షను నిర్వహించారు. ప్రపంచంలోనే తొలిసారిగా రెక్కలున్న వాహకనౌకను భూమికి 4.5 కి.మీ. దూరం నుంచి సురక్షితంగా, స్వయంగా రన్‌వేపై ల్యాండ్ అయ్యే పరీక్షను చేపట్టింది. ఐఏఎఫ్‌కు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్వీని సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టగా, టెస్ట్ రేంజ్‌లోని రన్‌వేపై అది సురక్షితంగా దిగింది.
కేరళ నంబర్ వన్
- జియో ట్యాగింగ్‌లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. అధికారులు ఏప్రిల్ 5న వెల్లడించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రికార్డుల ప్రకారం.. 2022-23కు కేరళకు చెందిన ఉత్పత్తులకే అత్యధిక జీఐ ట్యాగ్లు లభించాయి. ఆ రాష్ర్టానికి చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జీఐ ట్యాగ్లు లభించాయి.
- బీహార్‌కు చెందిన మిథిలా మఖానా, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ తెల్ల ఉల్లిగడ్డలు, తెలంగాణలోని తాండూరు కందిపప్పు, లఢక్‌కు చెందిన రాక్సో కాప్రో అప్రికాట్, అసోంలోని గమోసా హస్తకళలకు జియో ట్యాగ్లు దక్కాయి. 2022-23లో మొత్తం 12 ఉత్పత్తులకు జీఐ లభించగా, అందులో రెండు విదేశాలకు చెందినవి ఉన్నాయి. 2021-22లో మొత్తం 50 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌లను సాధించాయి. ఆ ఏడాదిలో ఉత్తరప్రదేశ్ 7 ట్యాగ్‌లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
Previous article
Current Affairs April 12 | తెలంగాణ
Next article
April 12 Current Affairs | అంతర్జాతీయం
RELATED ARTICLES
-
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
-
Current Affairs – Groups Special | ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
-
August Current Affairs | 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా నిలిచింది?
-
Current Affairs | శ్రామిక్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
-
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?