April 12 Current Affairs | అంతర్జాతీయం
అంతర్జాతీయం
ఫోన్ కాల్‌కు 50 ఏండ్లు
సెల్ ఫోన్ కాల్‌కు ఏప్రిల్ 3తో 50 ఏండ్లు పూర్తయ్యాయి. 1973, ఏప్రిల్ 3న మార్టిన్ కూపర్ మొదటి ఫోన్ కాల్ చేశారు. అప్పట్లో ఆయన మోటొరోలా కంపెనీలో పనిచేసేవారు. న్యూయార్క్‌లోని సిక్త్స్ అవెన్యూ 53, 54వ వీధుల మధ్య ఆయన నడుస్తూ సెల్‌ఫోన్ నుంచి మొదటి కాల్ మాట్లాడారు. ఆ సమయంలో మోటొరోలాకు ప్రత్యర్థి కంపెనీ అయిన బెల్ ల్యాబొరేటరీస్‌కు చెందిన ఇంజినీర్ జోయెల్ ఎంజెల్కు కూపర్ ఫోన్ చేయడం విశేషం. జోయెల్.. నేను మార్టిన్, సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను, చేతుల్లో పట్టుకోదగిన నిజమైన పోర్టబుల్ సెల్ ఫోన్ ఇది అంటూ మాట్లాడారు. మొదటి సెల్ ఫోన్ పేరు డైనాటాక్ (డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజ్). పదేండ్లకు డైనాటాక్ 8000 ఎక్స్ పేరుతో అమెరికాలో మోటరోలా సంస్థ ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభించింది. 1983లో 3,995 డాలర్లకు మొదటిసారి దీన్ని విక్రయించారు. ఇది చెప్పుల డబ్బా అంత పెద్దగా, కిలో బరువు ఉండేది. 25 నిమిషాలు మాట్లాడటానికి 10 గంటలు చార్జింగ్ పెట్టేవారు.
ఎన్ఈడీఏసీ మీటింగ్
3వ నెట్వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ (ఎన్ఈడీఏసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏప్రిల్ 6 నుంచి 8 వరకు నేపాల్‌లోని కఠ్మాండులో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యవసాయ గమనాన్ని మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేశాల మధ్య సహకారం, పేదరిక నిర్మూలనకు పాటు పడాలని కోరారు. ఈ సమావేశానికి భారత్ నుంచి నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆసియా-పసిఫిక్ (ఐసీఏ-ఏపీ) ప్రెసిడెంట్ డా. చంద్రపాల్ సింగ్, నాఫ్కాబ్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు (తెలంగాణ), ఆసియా, పసిఫిక్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆసియా, పసిఫిక్ దేశాల్లోని వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ ఎన్ఈడీఏసీని 1991లో ఏర్పాటు చేశారు. దీనిలో 12 దేశాల్లోని 21 కోఆపరేటివ్ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?