Current Affairs April 12 | తెలంగాణ
తెలంగాణ
కూల్ రూఫ్ పాలసీ
కూల్ రూఫ్ పాలసీ 2023-28కి సంబంధించిన విధాన పత్రాన్ని మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆవిష్కరించారు. దేశంలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రం తెలంగాణ. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు కూల్ రూఫ్ (చలువ పైకప్పు) విధానాన్ని తీసకువచ్చామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. న్యూయార్క్ నగరం 0.1 చ.కి.మీ. మాత్రమే కూల్ రూఫింగ్ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ తెలంగాణ అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమైందని మంత్రి ప్రకటించారు. 2028 నాటికి 300 చ.కి.మీ.ల పరిధిలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రాబోయే ఐదేండ్లలో హైదరాబాద్‌లో 200 చ.కి.మీ., ఇతర ప్రాంతాల్లో 100 చ.కి.మీ. కూల్ రూఫింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 1000 చ.కి.మీ. ఉంటుందని, దీనిలో 20 శాతం కూల్ రూఫింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
సంతోష్‌కు అవార్డు
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు గ్రీన్ రిబ్బన్ చాంపియన్ అవార్డు లభించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్వర్క్ 18 గ్రూప్ ఈ అవార్డును ఆయనకు ఏప్రిల్ 1న అందజేసింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్ని వర్గాల ప్రాతినిథ్యానికి కృషి, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. సేవ్ టైగర్ ఉద్యమానికి 50 ఏండ్లు అయిన సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ విడుదల చేసిన టైగర్ బుక్, టీ షర్ట్, కాఫీ మగ్, సావనీర్లను ఎంపీ సంతోష్ ప్రదర్శించారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు చోటు లభించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సలా కౌల్ బెనర్జీ ఈ రికార్డ్‌కు సంబంధించి పత్రాన్ని ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంతోష్‌కు అందజేశారు. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2021, జూలై 4న గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని ప్రకటించింది.
ఐజేఎస్-2022
ఇండియా జస్టిస్ రిపోర్టు-2022ను టాటా ట్రస్ట్ ఏప్రిల్ 4న విడుదల చేసింది. దీనిలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ మొదటి ర్యాంకులో నిలువగా.. జైళ్లు 3, న్యాయవ్యవస్థ 5, న్యాయ సాయం 5వ ర్యాంకులో నిలిచింది. ఓవరాల్‌గా కర్ణాటక, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. 3వ ర్యాంకులో తెలంగాణ ఉంది. గుజరాత్ 4, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాల్లో నిలిచాయి. టాటా ట్రస్ట్ 2019 నుంచి ఐజేఆర్ నివేదికను ఇస్తుంది.
పుస్తకావిష్కరణ
‘వింగ్డ్ ఫ్రెండ్స్-బర్డ్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్’ అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 6న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సంహిత్ చితాజల్లు అనే తొమ్మిదేండ్ల బాలుడు రాశాడు. అడవులపై ఉన్న ఇష్టంతో ఈ పుస్తకాన్ని రచించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?