Current affairs May 31 | జాతీయం
బంగ్లాదేశ్‌కు లోకోమోటివ్‌లు
బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ (బీజీ) లోకోమోటివ్లను మే 23న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ రైల్ భవన్లో వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి రైల్వే మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ పాల్గొన్నారు. 2019లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ డీజిల్ లోకోమోటివ్లను భారత ప్రభుత్వం మంజూరు చేస్తూ బంగ్లాదేశ్‌కు అప్పగించింది. ఇరుదేశాల వాణిజ్యం మెరుగుపర్చడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఎంఆర్ శామ్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్)ని ఇండియన్ నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి మే 23న విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలానికి చేరువగా వెళ్తున్న (సీ స్కిమింగ్) లక్ష్యాన్ని ఇది ఛేదించింది. శత్రు రాడార్ల కళ్లుగప్పడానికి కొన్ని రకాల క్షిపణులు, యుద్ధ విమానాలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తుంటాయి. వీటిని ఛేదించడం కష్టం. వాటిని కూడా నేలకూల్చగల సత్తా ఎంఆర్ శామ్కు ఉంది.
ఏఎఫ్ఎస్పీఏ చట్టం
2023 చివరి నాటికి అసోం నుంచి ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మే 22న వెల్లడించారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్ (ఏఎఫ్ఎస్పీఏ)ను 1958లో రూపొందించారు. తీవ్రవాదం లేదా సంఘర్షణలు జరిగే ప్రాంతాల్లో సాయుధ బలగాలకు ప్రత్యేకాధికారాలు ఈ చట్టం కల్పిస్తుంది. కానీ ఈ చట్టం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల సంఘం పేర్కొంటుంది. దీంతో ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
సూపర్ కంప్యూటర్
18 పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటర్ను ఈ ఏడాది చివర్లో ఆవిష్కరించనున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరెన్ రిజిజు మే 24న వెల్లడించారు. ఈ కంప్యూటర్ను వాతావరణ సూచనల కోసం రూపొందిస్తున్నారు. దీనివల్ల ముందస్తు హెచ్చరికలు జారీచేసి, మెరుగైన సంసిద్ధతా చర్యలు తీసుకోవవచ్చు. నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్)లో 2.8 పెటాఫ్లాప్ సూపర్‌కంప్యూటర్ ‘మిహిర్’, పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ (ఐఐటీఎం)లో 4.0 పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటర్ ‘ప్రత్యూష్’ ఉంది. రూ.900 కోట్లతో కొత్త సూపర్ కంప్యూటర్ను కొనుగోలు చేయనున్నారు. దీంట్లో 8 పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటింగ్ పవర్ ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్కి, మిగిలిన 10 పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటింగ్ పవర్ ఐఐటీఎంకు వెళ్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?