Current Affairs May 31 | అంతర్జాతీయం
వాతావరణ సదస్సు
ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ మెటీయోరాలాజికల్ ఆర్గనైజేషన్-డబ్ల్యూఎంవో) సమావేశం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మే 22న ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రపంచ విపత్తుల వల్ల కలిగిన నష్టాల గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 1970-2021 మధ్య సంభవించిన 12 వేల విపత్తుల వల్ల సుమారు 20 లక్షల మంది చనిపోయారు, రూ.35 లక్షల కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇదే కాలంలో భారతదేశంలో సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పాయారు. ఆసియాలో గత 50 ఏళ్లలో 3,600 విపత్తులు కలిగి 9,84,263 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.11 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.
గినియాలో మోదీ
పపువా న్యూ గినియాలో పర్యటించేందుకు మే 22న ఆ దేశానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ. ఈ సందర్భంగా మూడో ఇండియా-పసిఫిక్ ద్వీప దేశాల వేదికలో పాల్గొన్నారు. పసిఫిక్ సముద్రంలోని 14 దేశాల సమాహారమైన ఈ వేదిక భౌగోళికంగా వ్యూహాత్మకంగా కీలకమైంది. ఈ 14 దీవుల్లో సముద్ర అంబులెన్స్‌లు, జల ఔషధ కేంద్రాలు, సముద్ర నీటిని మంచి నీటిగా మార్చే కేంద్రాలను భారత్ ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు. పపువా న్యూ గినియాతో పాటు ఫిజీ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు’ అవార్డును మోదీకి బహూకరించారు. ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’తో మోదీని సత్కరించారు.
మిజరబుల్ ఇండెక్స్
ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే 157 దేశాలతో ‘వరల్డ్స్ మోస్ట్ మిజరబుల్ కంట్రీస్ లిస్ట్ (ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశాల జాబితా)-2022’ను మే 24న విడుదల చేసింది. ఈ జాబితాను ఆ దేశాల్లోని ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి రూపొందించింది. దీనిలో ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే 157వ ర్యాంక్‌లో నిలిచింది. జింబాబ్వే తర్వాత వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతి, అంగోలా, టోంగా, ఘనా టాప్ 15లో ఉన్నాయి. ఈ జాబితాలో సంతోషంగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైగర్, థాయిలాండ్, టోగో, మాల్టా ఉన్నాయి. దీనిలో భారత్ 103వ స్థానంలో ఉంది. నిరుద్యోగం ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో విచారం ఉన్నట్లు ఈ సూచీ తెలిపింది. అమెరికా 134వ స్థానంలో ఉంది. అమెరికన్ల విచారానికి కూడా నిరుద్యోగమే కారణమనని తెలిపింది. ఫిన్లాండ్ 109వ స్థానంలో ఉంది.
ఐఎస్సీ 2023
ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ (ఐఎస్సీ)- 2023 ను మే 24న జర్మనీలో నిర్వహించారు. దీనిలో టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ లిస్టును విడుదల చేశారు. దీనిలో అమెరికాకు చెందిన ఫ్రాంటియర్, హెచ్‌పీఈ క్రే ఎక్స్235ఏ మొదటి స్థానంలో నిలిచింది. సూపర్ కంప్యూటర్ ఫుగాకు, ఏ64ఎఫ్ఎక్స్ (జపాన్) 2, లూమి, హెచ్‌పీఈ క్రే ఈఎక్స్235ఎ (ఫిన్లాండ్) 3, లియోనార్డో, గ్జియాన్ ప్లాటినమ్ 8358 32సి (ఇటలీ) 4, సమ్మిట్, ఐబీఎం పవర్ సిస్టమ్ ఏసీ922 (అమెరికా) 5వ స్థానాల్లో ఉన్నాయి. దీనిలో భారత్‌కు చెందిన ఐరావత్ (సీ డాక్ పుణె) 75వ ర్యాంకులో నిలిచింది. పరమ్ సిద్ధి (సీ డాక్ పుణె) 131, ప్రత్యూష్ (ఐఐటీఎం పుణె) 169, మిహిర్ (ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్, నోయిడా) 316వ ర్యాంకులో నిలిచాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?