Current Affairs April 05 | తెలంగాణ
యాదాద్రి, వర్గల్ దేవాలయాలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ మార్చి 28న సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా ‘బ్లిస్ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ (భోగ్)’ సర్టిఫికెట్ పొందిన దేవాలయాలుగా రికార్డు సృష్టించాయి. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ర్టాల్లో ఈ ఆలయాలకు గుర్తింపు దక్కింది. కేంద్రం నుంచి ప్రత్యేక ఆడిట్ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలను పరిశీలించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వంటి కొన్ని ప్రముఖ దేవాలయాలకు మాత్రమే భోగ్ గుర్తింపు ఉంది.
చరక అవార్డు
ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును మార్చి 30న అందుకున్నారు. చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ ఈ అవార్డును ప్రదానం చేసింది. వ్యాధులపై పరిశోధనలు చేయడం, స్వచ్ఛమైన తాగునీటి వసతిని కల్పించడం వంటి అంశాల ఆధారంగా ఈ అవార్డును క్లబ్ అధ్యక్షుడు రమేశ్‌బాబు అందజేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?