Current Affairs | క్రీడలు
వొండ్రుసోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా మార్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జూలై 15న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా ఆరో సీడ్ జూబెర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా వొండ్రుసోవా రికార్డు సృష్టించింది. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. విజేతకు రూ.25.25 కోట్లు, రన్నరప్ జూబెర్కు రూ.12.62 కోట్ల నగదు బహుమతిని అందజేశారు.
సౌత్ జోన్‌దే దులీప్ ట్రోఫీ
దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీని హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ గెలుచుకుంది. బెంగళూరులో జూలై 16న జరిగిన ఫైనల్లో 75 పరుగుల తేడాతో వెస్ట్ జోన్‌పై విజయం సాధించింది. 298 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోర్ 182/5తో చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్ట్ జోన్ 222 పరుగులకు ఆలౌటైంది. సౌత్ జోన్ పేసర్ విద్వత్ కావేరప్పకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి.
అల్కారాజ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కారాజ్ నిలిచాడు. ఆల్ ఇంగ్లండ్ కోర్ట్‌లో జూలై 16న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్పై విజయం సాధించారు. అల్కారాజ్‌కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు