National Current Affairs | జాతీయం
డిజిటల్ పేమెంట్స్
డిజిటల్ ట్రాన్జాక్షన్లలో భారత్ మొదటి స్థానంలో ఉంది. జూన్ 11న విడుదలైన మైగవ్ ఇండియా డేటా సమాచారం ప్రకారం 2022లో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్ 46 శాతం వాటాను సాధించింది. భారత్‌లో జరిగినన్ని లావాదేవీలు మరే దేశంలోనూ జరగలేదు. 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా.. 17.6 మిలియన్లతో చైనా మూడో స్థానంలో ఉంది. థాయిలాండ్ (16.5 మిలియన్లు) 4, దక్షిణ కొరియా (8 మిలియన్లు) 5వ స్థానాల్లో ఉన్నాయి.
సంశోధక్
యుద్ధనౌక ‘సంశోధక్’ను చెన్నైలోని కట్టుపల్లిలో జూన్ 13న సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఇది ఇండియన్ నేవీ కోసం ఎల్అండ్టీ/జీఆర్ఎస్ఈ నిర్మించిన సర్వే వెజెల్స్ (లార్జ్) (ఎస్వీఎల్) ప్రాజెక్టులోని నాలుగో నౌక. సంశోధక్ అంటే పరిశోధకుడు అని అర్థం. 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 3,400 టన్నుల బరువుతో ఎస్వీఎల్ నౌకలను తయారు చేశారు. వీటిలో మొదటి మూడు నౌకలు సంధాయక్ (2021, డిసెంబర్ 5), నిర్దేశక్ 2022, మే 26), ఇక్షక్ (2022 నవంబర్ 22).
గబాన్ సెజ్
గబాన్ దేశ మొదటి అగ్రి సెజ్ ప్రాజెక్టును ఢిల్లీలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 14న ప్రారంభించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఈ ప్రాజెక్టును సెంచూరియన్ యూనివర్సిటీ, ఏవోఎం భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. భారత్-ఆఫ్రికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సహకారాన్ని పెంపొందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?