Sports Current Affairs | క్రీడలు
సిక్కిరెడ్డి
తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి డెన్మార్క్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. డెన్మార్క్‌లో జూన్ 11న జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి రోహన్ కపూర్‌తో కలిసి వెస్టర్‌గార్డ్-క్రిస్టియన్ బాష్ (డెన్మార్క్) జోడీపై విజయం సాధించింది. సిక్కి-రోహన్ జంటగా గెలిచిన మూడో టైటిల్ ఇది.
ఆసియా కప్
మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్‌ను భారత జట్టు గెలుచుకుంది. జపాన్‌లోని కకమిగహరలో జూన్ 11న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రిపబ్లిక్ కొరియాను 2-1తో ఓడించింది. మహిళల జూనియర్ ఆసియా కప్‌ను భారత్ గెలవడం ఇదే తొలిసారి. భారత జూనియర్ మహిళల జట్టు ఇప్పటికే ఈ ఏడాదిలో జరిగే ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ జూనియర్ వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకుంది.
జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. పారిస్‌లో జూన్ 11న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కాస్పర్ రూడ్‌పై విజయం సాధించాడు. దీంతో జొకోవిచ్ 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి రికార్డు సృష్టించాడు. నాదల్ 22 టైటిళ్లు గెలిచి రెండో స్థానంలో ఉన్నాడు.
రెజ్లింగ్ విజేత భారత్
అండర్-17 మహిళల ఆసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకుంది. కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్లో జరుగుతున్న ఈ పోటీలు జూన్ 12న ముగిశాయి. ఈ పోటీలో భారత యువ మహిళా రెజ్లర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు.
సౌమ్యరాణి
చైనీస్ తైపీ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-15 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తెలంగాణకు చెందిన సౌమ్యరాణి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు జూన్ 13న వెల్లడించారు. ఈమె తాడ్వాయిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతుంది. ఈ టోర్నీలో ఆమెతోపాటు తెలంగాణ నుంచి ఏడుగురు భారత్ తరఫున ఆడనున్నారు. ఆమె కోచ్ మౌనిక.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?