International Current Affairs | అంతర్జాతీయం
స్లేవరీ ఇండెక్స్
గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ (ప్రపంచ బానిసత్వ సూచీ)-2023 ను జూన్ 13న విడుదల చేశారు. ఆధునిక బానిసత్వంపై 160 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ సూచీని ఆస్ట్రేలియాకు చెందిన హక్కుల సంస్థ వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) సహకారంతో రూపొందించింది. దీనిలో అధిక బానిసత్వం ప్రాబల్యం ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా మొదటి స్థానంలో ఉండగా.. ఎరిత్రియా 2, మారిటానియా 3, సౌదీ అరేబియా 4, తుర్కియే 5వ స్థానాల్లో ఉన్నాయి. అత్యల్ప ప్రాబల్యం ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ 160వ ర్యాంక్‌లో ఉండగా.. నార్వే 159, జర్మనీ 158, నెదర్లాండ్స్ 157, స్వీడన్ 156వ ర్యాంకుల్లో ఉన్నాయి. జీ20 దేశాల్లో బలవంతపు కార్మికులుగా పనిచేస్తున్న 11 మిలియన్ల మంది జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో చైనా, రష్యా, ఇండోనేషియా, తుర్కియే, అమెరికా ఉన్నాయి.
అల్బినిజం డే
ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని జూన్ 13న నిర్వహించారు. అల్బినిజం అనే జన్యుపరమైన చర్మ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అల్బినిజం అవేర్నెస్ డేని నిర్వహించాలని 2013లో గుర్తించింది. 2014, డిసెంబర్ 18న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జూన్ 13న ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని నిర్వహించాలని తీర్మానించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘ఇన్‌క్లూజన్ ఈజ్ స్ట్రెంత్’.
బ్లడ్ డోనర్ డే
వరల్డ్ బ్లడ్ డోనర్ డే (ప్రపంచ రక్తదాతల దినోత్సవం)ని జూన్ 14న నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదాతల నిస్వార్థ సేవలను ప్రజలకు తెలియజేసేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్బీడీవో), ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ఐఎస్బీటీ) ఈ దినోత్సవాన్ని 2004లో గుర్తించింది. 50వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని చేపట్టాలని 2005లో నిర్ణయించారు. ఆస్ట్రియన్ బయాలజిస్ట్ కార్ల్ ల్యాండ్‌స్టీనర్ సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన జూన్ 14న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘గివ్ బ్లడ్, గివ్ ప్లాస్మా, షేర్ లైఫ్, షేర్ ఆఫెన్ (రక్తం ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి, తరచూ పంచుకోండి)’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు