జాతీయం 25/05/2022
నంజరాయన్ సరస్సు
తమినాడు ప్రభుత్వం 17వ పక్షుల అభయారణ్యంగా నంజరాయన్ సరస్సును ప్రకటించింది. 440 ఎకరాల్లో విస్తరించిన ఈ సరస్సు తిరుప్పూర్‌లో ఉంది. బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఈ సరస్సులో 220 కార్మోరెంట్ అనే పక్షులు, 165 పెలికాన్ పక్షులు ఉన్నాయి. ఈ సరస్సును సర్కార్ పెరియపాళయం రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు.
5జీ టెస్ట్ బెడ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోదీ మే 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు తమ ఉత్పత్తులను సాంకేతికంగా స్థానికంగా పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు. రూ.220 కోట్లతో ఏర్పాటు చేసిన ఇది విదేశీ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ప్రధాని అన్నారు.
ఐఎన్ఎస్ సూరత్, ఉదయగిరి
ఐఎన్ఎస్ సూరత్, ఉదయగిరిలను ముంబైలోని మజ్గావ్ డాక్ యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 17న ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ముంబైకి చెందిన మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) తయారుచేసింది. రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి.
ఎన్డీబీ గవర్నర్ల సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మే 19న నిర్వహించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్ల 7వ వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికా, కొత్తగా జాయిన్ అయిన బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాల్గొన్నాయి. దీని థీమ్ ‘ఎన్డీబీ: ఆప్టిమైజింగ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్’.
ఎస్సీవో సమావేశం
భారత్ అధ్యక్షతన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాన్ని ఢిల్లీలో మే 16 నుంచి 19 వరకు నిర్వహించారు. అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ప్రధానంగా, వివిధ ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సహకారం గురించి చర్చించారు. ఎస్సీవోలో భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్ పరిశీలక దేశంగా ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?