క్రీడలు 25/05/2022

నిఖత్ జరీన్
12వ ఎడిషన్ ఐబీఏ (ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్) ఉమెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 19న నిర్వహించిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీ ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ 5-0తో థాయిలాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన తెలుగు రాష్ట్రాల నుంచి తొలి క్రీడాకారిణిగా, భారత్ తరఫున మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కెసి తరువాత ఐదో మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది.
నిఖత్ గెలుచుకున్న ఈవెంట్లు
2011లో టర్కీలో జరిగిన ప్రపంచ జూనియర్, యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
2014 నేషన్స్ కప్‌లో స్వర్ణం
2015లో జాతీయ సీనియర్ చాంపియన్ షిప్లో స్వర్ణం
2016లో దక్షిణాసియా ఫెడరేషన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
2018లో సెర్బియా బెల్గ్రేడ్ టోర్నీలో స్వర్ణం
2019 థాయిలాండ్ ఓపెన్‌లో రజతం
2019, 2022 స్ట్రాంజా మెమోరియల్‌లో స్వర్ణం
ఐబీఏని 1946లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం లాసానే (స్విట్జర్లాండ్). ఐబీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లియోవ్.
RELATED ARTICLES
-
రన్నింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన వృద్ధురాలి వయసెంతంటే..? ( క్రీడలు)
-
ఈ ఏడాది జాతీయ పఠన దినోత్సవ థీమ్..? (జాతీయం)
-
ప్రపంచ శరణార్థులదినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (అంతర్జాతీయం)
-
‘దిమ హసావో’ జిల్లాలో వేటిని కనుగొన్నారు? (కరెంట్ అఫైర్స్)
-
Check out some prominent events
-
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ ? (వార్తల్లో వ్యక్తులు) 22-06-2022
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్‌లో450 పోస్టుల భర్తీ