అంతర్జాతీయం 25/05/22
పొడవైన స్కై బ్రిడ్జ్
చెక్రిపబ్లిక్లోని డోల్నీ మొరావాలో ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి)ను మే 13న ప్రారంభిం చారు. ‘స్కై బ్రిడ్జి 721’ పేరుతో పిలిచే ఈ వంతెన 2365 అడుగుల (721 మీటర్లు) పొడవులో సముద్ర మట్టానికి 1100 మీటర్లకు పైగా ఎత్తున నిర్మించారు. రెండు పర్వత శిఖరాలను కలుపుతూ ఒక లోయపై 95 మీటర్ల (312 అడుగులు) ఎత్తున దీనిని నిర్మించారు. పాదచారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాడే వంతెనల్లోకెల్లా ఇదే పొడవైనది.
బౌద్ధ కేంద్రం
అంతర్జాతీయ బౌద్ధ సాంస్కృతిక వారసత్వ కేంద్రం నిర్మాణానికి ప్రధాని మోదీ నేపాల్లో మే 16న శంకుస్థాపన చేశారు. లుంబిని మోనాస్టిక్ జోన్లో దీనిని నిర్మించనున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహామాయా దేవి ఆలయాన్ని సందర్శించారు.
హైపర్సోనిక్ క్షిపణి
గాలి కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణిని అమెరికా మే 16న బీ-52 బాంబర్ ద్వారా గగనతలం నుంచి విజయవంతంగా పరీక్షించింది. గతంలో మూడుసార్లు పరీక్షించగా విఫలమైంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి దీన్ని పరీక్షించారు.
ఇంటర్నేషనల్ మ్యూజియం డే
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీవోఎం) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మ్యూజియం దినోత్సవాన్ని మే 18న నిర్వహించారు. సంస్కృతి, చరిత్ర, సైన్స్ గురించి విస్తారమైన సమాచారాన్ని కలిగిన మ్యూజియంల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం. మే 18న ఈ మ్యూజియం డేని నిర్వహించాలని ఐసీవోఎం 1977లో నిర్ణయించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘ది పవర్ ఆఫ్ మ్యూజియమ్స్’.
నాటోలో ఫిన్లాండ్, స్వీడన్
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)లో చేరడానికి ఫిన్లాండ్, స్వీడన్, దానికి సంబంధించిన దరఖాస్తులను బ్రస్సెల్స్లోని కూటమి ప్రధాన కార్యాలయానికి మే 18న పంపించాయి. రష్యా తమపైనా దురాక్రమణ కు దిగవచ్చనే ఉద్దేశంతో ఆ దేశాలు నాటోలో చేరాలని నిర్ణయించుకున్నాయి.
వరల్డ్ బీ డే
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం (వరల్డ్ బీ డే)ను నిర్వహించారు. పర్యావరణ వ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాల ప్రాముఖ్యతను గుర్తించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తేనెటీగల పెంపకంలో మార్గదర్శకురాలిగా నిలిచిన అంటోన్ జాన్సా జ్ఞాపకార్థంగా ఆమె జన్మదినాన్ని మే 20 (1734)ని వరల్డ్ బీ డే నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటిం చింది. ఈ ఏడాది దీని థీమ్ ‘బీ ఎంగేజ్డ్: సెలబ్రేటింగ్ ది డైవర్సిటీ ఆఫ్ బీస్ అండ్ బీకీపింగ్ సిస్టమ్స్’. ఎఫ్ఏవోను 1945, అక్టోబర్ 16న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం రోమ్ (ఇటలీ). దీని డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?