Current Affairs March 08 | జాతీయం
జాతీయం
పొడవైన సైకిల్ రేస్
ఆసియాలోనే అతి పొడవైన సైకిల్ రేస్ కశ్మీర్లో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యింది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు 3,655 కి.మీ. సాగుతుంది. ఈ రేసులో పాల్గొంటున్న ఏకైక మహిళ గీతా ఎస్ రావు (పోలియో బాధితురాలు). 12 రోజుల పాటు ఈ రేసు సాగుతుంది. వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ (డబ్ల్యూయూసీఏ) ఈ రేసుకు ఆసియా అల్ట్రా సైక్లింగ్ చాంపియన్‌షిప్ హోదాను కల్పించిందని అల్ట్రా సైక్లింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జితేంద్ర నాయక్ వెల్లడించారు. ఈ రేసు 12 రాష్ర్టాలు, 3 మహానగరాలు, 20కి పైగా నగరాల మీదుగా సాగుతుంది.
ఈశాన్య రాష్ర్టాల ఎన్నికలు
మూడు ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 2న వెలువడినాయి. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అత్యధికంగా 26 స్థానాల్లో గెలుపొందింది. యూడీపీ 11, కాంగ్రెస్ 5, ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందాయి. నాగాలాండ్‌లో ఈశాన్య ప్రజాస్వామిక కూటమి 37 స్థానాల్లో విజయం సాధించింది. త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి 32 స్థానాల్లో గెలిచింది. తిప్రమోత పార్టీ 20 శాతం ఓట్లతో 13 స్థానాల్లో గెలుపొందింది.
60 ఏండ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. హెకానీ జఖాలు ఎన్డీపీపీ తరఫున దిమాపూర్-3 నుంచి పోటీ చేసి గెలుపొంది ఆ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న తొలి మహిళగా నిలిచారు. సత్హౌతునొ క్రుసె వెస్టర్న్ అంగామిలో గెలుపొందారు.
క్వాడ్ సమావేశం
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆధ్వర్యంలో క్వాడ్ కూటమి (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) సమావేశం ఢిల్లీలో ఫిబ్రవరి 3న నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ హాజరయ్యారు. ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని క్వాడ్ దేశాలు తప్పుపట్టాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.
రైసినా డైలాగ్
8వ రైసినా డైలాగ్ న్యూఢిల్లీలో మార్చి 2 నుంచి 4 వరకు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ప్రొవొకేషన్, అన్సర్టెయింటీ, టర్బులెన్స్: లైట్‌హౌస్ ఇన్ ది టెంపెస్ట్’ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు. భౌగోళిక రాజకీయాలు, వ్యూహాలు, అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానాలు, అణు సమస్యలపై చర్చించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?