Current Affairs March 27th | అంతర్జాతీయం
నేపాల్-ఇండియా
నేపాల్‌లో మూడు రోజులు నిర్వహించిన నేపాల్-ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ మార్చి 19న ముగిసింది. బిరత్‌నగర్ మెట్రోపాలిటన్ సిటీ (నేపాల్), క్రాంతిధార లిటరేచర్ అకాడమీ ఆఫ్ మీరట్ (ఇండియా) ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. దీనిలో నేపాల్, భారత్ నుంచి 350 మంది సాహిత్య రచయితలు పాల్గొన్నారు. నేపాల్-ఇండియా మధ్య సాహిత్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 10 పాయింట్ల బిరత్‌నగర్ డిక్లరేషన్‌ను ఆమోదించారు. ఇరుదేశాల సాహిత్యాన్ని పరస్పరం హిందీ నుంచి నేపాలీలోకి నేపాలీ నుంచి హిందీలోకి అనువదించడం, మహాభారతంలోని బిరాట ప్యాలెస్‌ను మహాభారత్ సర్క్యూట్‌తో అనుసంధానించడం, పురావస్తు కళాఖండాలను అన్వేషించడానికి సాహిత్య రచయితలను ప్రోత్సహించడం, ఇరుదేశాల రచయితలు తమ సాహిత్యాన్ని పంచుకోవడానికి ఆన్లైన్ వేదికను సృష్టించడం తదితర విషయాల 10 పాయింట్స్ డిక్లరేషన్‌లో పొందుపర్చారు.
ఫ్లాట్బర్న్
గాలి కాలుష్యాన్ని కొలిచే చవకైన పరికరం ‘ఫ్లాట్బర్న్’ అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు మార్చి 19న వెల్లడించారు. 2017లో దీన్ని రూపొందించినా, ఇప్పుడు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. నైట్రోజన్ సహా వివిధ కాలుష్య కారకాలను ఈ పరికరం కచ్చితంగా కొలుస్తుంది. 3డీ ప్రింటింగ్ ద్వారా లేదా చవకైన విడి భాగాలు ఆర్డర్ చేయడం ద్వారా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పరికరం న్యూయార్క్, బోస్టన్లలో లభ్యమవుతుంది.
స్టార్క్రేట్
అంగారకుడిపై నిర్మాణాలు చేపట్టేందుకు కొత్త కాంక్రీట్‌ను తయారుచేసినట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన సైంటిస్టులు మార్చి 19న వెల్లడించారు. దీనికి స్టార్క్రేట్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో అంగారకుడిపై నిర్మాణాలు చేపడితే భూమి నుంచి కాంక్రీట్‌ను తీసుకెళ్లడం కష్టం కాబట్టి అక్కడే లభ్యమయ్యే ధూళి, ఆలుగడ్డలు, ఉప్పును వినియోగించి ఈ కాంక్రీటును తయారుచేయవచ్చని వెల్లడించారు.
వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్
‘ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే’ సందర్భంగా మార్చి 20న ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్-2023’ని విడుదల చేసింది. జీడీపీ పర్ క్యాపిటా, సామాజిక మద్దతు, ఆరోగ్యకర జీవన కాలపు అంచనా, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని, 150 దేశాలతో ఈ సూచీని రూపొందించారు. దీనిలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్ 2, ఐస్లాండ్ 3, ఇజ్రాయెల్ 4, నెదర్లాండ్స్ 5, స్వీడన్ 6, నార్వే 7, స్విట్జర్లాండ్ 8, లక్సెంబర్గ్ 9, న్యూజిలాండ్ 10వ స్థానాల్లో నిలిచాయి. ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి.
– ఈ సూచీలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. రష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానాల్లో ఉన్నాయి.
ఫారెస్ట్ డే
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ను మార్చి 21న నిర్వహించారు. మానవాళి మనుగడకు అడవులు, చెట్ల ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఈ డేని నిర్వహిస్తున్నారు. 2011లో ఐక్యరాజ్యసమితి 2011-20ను అంతర్జాతీయ అటవీ దశాబ్దంగా ప్రకటించింది. 2012లో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఫారెస్ట్ అండ్ హెల్త్’.
డౌన్ సిండ్రోమ్ డే
వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే (డబ్ల్యూడీఎస్డీ)ని మార్చి 21న నిర్వహించారు. డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల్లో క్రోమోజోము 21లో రెండు ఉండాల్సిన పోగులు మూడు ఉంటాయి. అందువల్ల దీన్ని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారు. దీనివల్ల పిల్లల్లో భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. వీరికి తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి. వీరిని సమాజంలో సమానంగా అంగీకరించాలని అవగాహన కల్పించేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. ఈ డేని మొదటిసారి 2006లో నిర్వహించారు. తర్వాత దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2011లో గుర్తించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘విత్ అజ్ నాట్ ఫర్ అజ్’.
వరల్డ్ వాటర్ డే
వరల్డ్ వాటర్ డేని మార్చి 22న నిర్వహించారు. ప్రపంచ నీటి సంక్షోభం, నీటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1992లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. మొదటి వాటర్ వరల్డ్ డేని 1993లో నిర్వహించారు. ఈ ఏడాది థీమ్ ‘యాక్సెలరేటింగ్ ది చేంజ్ టు సాల్వ్ ది వాటర్ అండ్ శానిటేషన్ క్రైసిస్’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?