Current Affairs March 27th | వార్తల్లో వ్యక్తులు
పీవీ సతీశ్
తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా పేరుగాంచిన పీవీ సతీశ్ మార్చి 19న మరణించారు. నిరుపేద దళిత మహిళలను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించడంతో పాటు అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటల సంరక్షణకు విశేష కృషి చేశారు. ఆయన కర్ణాటకలోని మైసూర్లో 1945, జూన్ 18న జన్మించారు. 1970లో చారిత్రక ఉపగ్రహ బోధన టెలివిజన్ ప్రయోగం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు. 1980లో స్నేహితులతో కలిసి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీని ప్రారంభించారు. 2019లో ఐరాస డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్, ప్రిన్స్ ఆల్బర్ట్-2 మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
లక్ష్మణ్ నరసింహన్
భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ అంతర్జాతీయ కాఫీ దిగ్గజ సంస్థ స్టార్‌బక్స్ సీఈవోగా మార్చి 20న బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో బ్రిటన్‌కు చెందిన కన్జ్యూమర్ హెల్త్, హైజీన్ అండ్ న్యూట్రిషన్ మల్టీనేషనల్ రెక్కిట్ బెన్స్కైజర్ సీఈవోగా పనిచేశారు. స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లోనే ఈయనను సీఈవోగా ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?