Current Affairs March 15th | అంతర్జాతీయం
ఉమెన్స్ డే
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మార్చి 8న నిర్వహించారు. మహిళల సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాలను గుర్తుచేసుకోవడానికి, వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ డేని ఏటా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని మొదటిసారి 1975లో నిర్వహించింది. ఈ ఏడాది థీమ్ ‘డిజిటల్ (DigitALL): ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’.
అప్పుల బాధల్లో దేశాలు
ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం చీఫ్ అచిమ్ స్టెయినర్ మార్చి 5న ప్రకటించారు. దీనిలో 23 దేశాలు ప్రభుత్వ ఆదాయంలో 5వ వంతు కంటే ఎక్కువ కేవలం రుణాల నిర్వహణకే చెల్లిస్తున్నాయని వెల్లడించారు.
చైనా రక్షణ వ్యయం
రక్షణ బడ్జెట్‌ను గతేడాది కంటే ఈసారి 7.2 శాతం ఎక్కువగా కేటాయించారని చైనా రక్షణ శాఖ మార్చి 5న వెల్లడించింది. దీంతో రక్షణ శాఖ బడ్జెట్ 225 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.18,38,537 కోట్లు) చేరింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు. చైనా రక్షణ బడ్జెట్‌ను పెంచడం వరుసగా ఇది 8వ సారి.
ఎంజైమ్
శుద్ధ ఇంధన ఉత్పత్తిదారుగా మానవాళికి ఉపయోగపడగల ఎంజైమ్‌ను కనుగొన్నట్లు ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు క్రిస్ గ్రీనింగ్, రిస్ గ్రింటర్ మార్చి 10న వెల్లడించారు. గాలిని విద్యుచ్ఛక్తిగా మార్చగల సామర్థ్యం ఉందని ప్రకటించారు. మట్టిలో ఎక్కువగా లభించే మైకో బ్యాక్టీరియం స్మెగ్మాటిస్ అనే బ్యాక్టీరియంలో ‘హక్’ ఎంజైమ్ ఉంటుందని, అది హైడ్రోజన్ వాయువును విద్యుత్ ప్రవాహంగా మార్చగలదని వివరించారు.
మహిళా న్యాయమూర్తుల డే
అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని మార్చి 10న నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో కూడా మహిళలకు పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ డేని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 2021 నుంచి నిర్వహిస్తున్నారు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?