March 15th Current Affairs | వార్తల్లో వ్యక్తులు
రష్మీ వడ్లకొండ
ఎమర్జింగ్ లీడర్-2023 అవార్డు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్ రష్మీ వడ్లకొండకు లభించింది. మార్చి 5న ఐర్లాండ్‌లో జరిగిన సమావేశంలో 2023కు ఉమెన్ మేక్ అవార్డులో ఆమె నిలిచారు. ఈ అవార్డును ‘ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్’ అందజేస్తుంది.
ఉదయ్ భాస్కర్
సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ డీఐజీగా బిళ్ల ఉదయ్ భాస్కర్ మార్చి 6న బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కశ్మీర్ రేంజ్ బారాముల్లా డీఐజీగా పనిచేసిన ఆయన డిప్యూటేషన్‌పై సీఆర్పీఎఫ్కు బదిలీ అయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా (కన్నవారి తోట)కు చెందిన ఆయన 2008 జమ్ముకశ్మీర్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్.
కాన్రాడ్ సంగ్మా
మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా మార్చి 7న షిల్లాంగ్‌లో ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత సంగ్మా రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్రాడ్ సంగ్మా.అలాగే నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో ప్రమాణం చేశారు. ఆయన నాగాలాండ్‌కు సీఎంగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి.
అరుణ్ సుబ్రమణియన్
సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్‌డీఎన్‌వై) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ మార్చి 7న నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ చదివారు.
వినయేంద్ర
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఫ్రైట్ ఫార్వాడర్స్ సంఘమైన ‘ఫ్రైట్ ఆర్గనైజేషన్ ఆఫ్ రిలేటెడ్ కార్గో ఎక్స్పర్ట్స్ (ఫోర్స్)’ ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన వినయేంద్ర పర్వతనేని మార్చి 7న ఎన్నికయ్యారు. సీవేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (సీవేస్ గ్రూపు) అనుబంధ కంపెనీల్లో ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫోర్స్‌కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైక అత్యంత పిన్న వయస్కుడు ఈయనే. ఫోర్స్‌కు ఒక్కో దేశం నుంచి ఒక కంపెనీ మాత్రమే ప్రతినిధిగా ఉంటుంది. ఫోర్స్‌ను 1982లో ఏర్పాటు చేశారు.
మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మార్చి 8న ప్రమాణం చేశారు. ఆయన త్రిపురకు సీఎంగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.
రామ్‌చంద్ర పౌడెల్
నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్‌చంద్ర పౌడెల్ మార్చి 9న ఎన్నికయ్యారు. ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది. 550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది రామ్‌చంద్రకు ఓటు వేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?