Current Affairs JULY | అంతర్జాతీయం
ఎస్సీవోలో ఇరాన్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో)లో ఇరాన్ చేరింది. ఎస్సీవో సమావేశాన్ని వర్చువల్‌గా జూన్ 4న నిర్వహించారు. ఎస్సీవోలో చేరడానికి ఇరాన్ 15 సంవత్సరాల క్రితం అభ్యర్థించింది. దీంతో ఇరాన్‌ను పరిశీలక సభ్య దేశం నుంచి శాశ్వత సభ్యదేశంగా చేర్చుకునేందుకు దుషాంబే (తజికిస్థాన్ రాజధాని)లో జరిగిన 21వ సమావేశంలో ఎస్సీవో సభ్యదేశాలు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం భారత్ అధ్యక్షతన జరిగిన 23వ సమావేశంలో శాశ్వత సభ్యదేశంగా ఇరాన్ పాల్గొన్నది.
గ్లోబల్ పీస్ ఇండెక్స్
17వ గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) ఇండెక్స్ 2023ని జూలై 4న విడుదల చేశారు. ఈ సూచీని 163 దేశాలతో ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రూపొందించింది. శాంతి, ఆర్థిక విలువ, పోకడలు, శాంతియుత సమాజాలను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఇప్పటి వరకు అత్యంత సమగ్రమైన డేటా ఆధారిత విశ్లేషణను ఈ నివేదిక అందిస్తుంది. ఈ సూచికలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్ 2, ఐర్లాండ్ 3, న్యూజిలాండ్ 4, ఆస్ట్రియా 5, సింగపూర్ 6, పోర్చుగల్ 7, స్లొవేనియా 8, జపాన్ 9, స్విట్జర్లాండ్ 10వ స్థానాల్లో నిలిచాయి. దీనిలో భారత్ 126వ స్థానంలో ఉండగా, భూటాన్ 17, నేపాల్ 79, బంగ్లాదేశ్ 88, చైనా 80, మయన్మార్ 145, పాకిస్థాన్ 146వ స్థానాల్లో ఉన్నాయి. చివరి నుంచి అఫ్గానిస్థాన్ 163, యెమెన్ 162, సిరియా 161, దక్షిణ సూడాన్ 160, కాంగో 159, రష్యా 158, ఉక్రెయిన్ 157, సోమాలియా 156, సూడాన్ 155, ఇరాక్ 154వ స్థానాల్లో ఉన్నాయి.
జూనోసిస్ డే
వరల్డ్ జూనోసిస్ డేని జూలై 6న నిర్వహించారు. జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించడానికి ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతువులు, కీటకాల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. 1885లో లూయిస్ పాశ్చర్ జూనోటిక్ వ్యాధి రేబిస్ వైరస్‌కు మొదటి వ్యాక్సిన్‌ను జూలై 6న విజయవంతంగా ఇచ్చారు. దీంతో జూనోటిక్ డేగా నిర్వహిస్తున్నారు.
67వ టీఏఏఐ
67వ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఏఐ) కాన్ఫరెన్స్‌ను కొలంబోలో జూలై 6న ప్రారంభించారు. మూడు రోజులు నిర్వహించిన ఈ సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే పాల్గొన్నారు. ట్రావెల్ ఇండస్ట్రీలో ఇరుదేశాల భాగస్వామ్యాలు, సహకారాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నారు. టూరిజం విజన్ 2047పై చర్చించారు. ట్రావెల్ ఇండస్ట్రీలో పెరుగుతున్న మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్ (ఎంఐసీఈ) పై దృష్టిసారించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?