Current Affairs JULY | తెలంగాణ
మమత
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలోని గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ అభ్యసిస్తున్న గిరిజిన విద్యార్థిని గుగులోతు(Mamatha Gugulothu) మమతకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఆర్సీడీఈ ఎస్ వెంకన్న, ప్రిన్సిపాల్ సుధా సింధు, ఫొటోగ్రఫీ టీచర్ రఘు థామస్ జూలై 4న వెల్లడించారు. ఆమె తీసిన ఫొటో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియన్‌కు ఎంపికయ్యింది. మమతది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బంజపల్లి గ్రామం. తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ విభాగంలో బీఏ (ఆనర్స్) సెకండియర్ చదువుతుంది. ఆమె తన నాయనమ్మ కేస్లీ సంప్రదాయ దుస్తులు వేసుకున్నప్పుడు ఫొటో తీసింది. ఈ ఫొటోతో పాటు ముంబైకి చెందిన ఫొటోగ్రఫీ టీచర్ రఘు థామస్ సేకరించిన ఇతర ఫొటోలను వోగ్‌కు పంపారు. వోగ్ మమత ఫొటోను ప్రచురించింది.
ఐఐటీహెచ్ సైంటిస్టులు
అంతరిక్షంలో వినిపిస్తున్న లయబద్ధమైన శబ్దాల (యూనివర్స్ హమ్మింగ్) వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రోఫిజిస్టులు ఛేదించారు. జపాన్, ఐరోపాలకు చెందిన అంతర్జాతీయ ఖగోళ సైంటిస్టుల బృందంతో కలిసి ఈ ఘనత సాధించారు. ఐఐటీహెచ్‌కు చెందిన డాక్టర్ శంతను దేశాయ్, అమన్ శ్రీవాస్తవ (పీహెచ్డీ విద్యార్థి), బీటెక్ విద్యార్థులు దివ్యాన్ష్ ఖర్బండా, శ్వేత ఆర్ముగం, ప్రజ్ఞ పరిశోధక బృందంలో ఉన్నారు. వీరు దేశంలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ను ఉపయోగించి పల్సర్ (ప్రకృతి ఉత్తమ గడియారాలు)లను పర్యవేక్షించారు. సూర్యుడి కంటే కోట్ల రెట్లు ఎక్కువ బరువున్న రాక్షస బ్లాక్‌హోల్ నానో హెర్ట్ గురుత్వాకర్షణ తరంగాలుగా పిలుస్తారని, ఈ తరంగాలే విశ్వంలో ప్రకంపనలు సృష్టిస్తాయి. యూరోపియన్ పల్సర్ టైటింగ్ అర్రే (ఈపీటీఏ), ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ) సభ్యుల ఈ పరిశోధన ఫలితాలను ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయని ఐఐటీహెచ్ సైంటిస్టులు జూలై 5న వెల్లడించారు.
నీరజ
తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజ ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్ (ఐఐవోపీఆర్) అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ఉద్యాన విజ్ఞాన డివిజన్ జూలై 4న ఉత్తర్వులు జారీచేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు