General Studies | విద్యుత్తు కెటిల్లో నీరు వేడెక్కడానికి కారణం?
1. కింది వాటిలో సరికానిది ఏది?
1) నీటి విశిష్టోష్ణం అనేది ద్రవ పదార్థాల కంటే ఎక్కువ
2) పాదరసం విశిష్టోష్ణం ద్రవ పదార్థాల కంటే ఎక్కువ
3) ద్రవ ఉష్ణోగ్రత మాపకాల్లో పాదరసం కానీ ఆల్కహాల్ కానీ ఉపయోగిస్తారు
4) జ్వరమానినిలో పాదరసం వాడుతారు
2. కింది వాటిలో సరికానిది ఏది?
1) పాదరసం మంచి ఉష్ణవాహకం
2) గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించే లోహ మూలకం
3) పాదరసాన్ని సిన్నిబార్ నుంచి గ్రహిస్తారు
4) పాదరసం రేడియేటర్లలో వాడుతారు
3. వంట పాత్రలకు అడుగుభాగంలో రాగిపూత పూయడానికి కారణం?
1) రాగి ఉత్తమ ఉష్ణ వాహకం
2) పాత్రలు అందంగా ఉండటానికి
3) పాత్రలను శుభ్రం చేయడం తేలిక అవుతుంది
4) పాత్రలను ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచడానికి
4. సిమెంట్ రోడ్లను వేసేటప్పుడు మధ్యలో ఖాళీలను వదులుతారు ఎందుకు?
1) వేయడం సౌకర్యవంతంగా ఉంటుందని
2) అందంగా ఉండటానికి
3) ఎండాకాలం వ్యాకోచం వల్ల పగుళ్లు రాకుండా ఉండటానికి
4) పైవన్నీ
5. నీరు మరిగే ఉష్ణోగ్రత?
1) 1000C 2) 373K
3) 2120F 4) అన్నీ సరైనవే
6. కింది వాటిని జతపరచండి.
ఎ. మెర్క్యురీ ఉష్ణోగ్రతా మాపకం
బి. ప్లాటినం నిరోధక ఉష్ణోగ్రతా మాపకం
సి. ఉష్ణ యుగ్మం ఉష్ణోగ్రతా మాపకం
డి. స్థిర ఘనపరిమాణ హైడ్రోజన్ వాయువు ఉష్ణోగ్రతా మపకం
1. -2000C నుంచి 16000C వరకు
2. -2000C నుంచి 5000C వరకు
3. -2000C నుంచి 12000C వరకు
4. -300C నుంచి 3500C వరకు
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
7. మంటలార్పడానికి చల్లని నీరు కంటే వేడి నీరు ఎందుకు మంచిది?
1) వేడి నీరు తొందరగా ఉష్ణాన్ని గ్రహించి ఆవిరిగా మారి చుట్టూ ఆక్సిజన్ లేకుండా చేస్తుంది
2) వేడి నీరు నిదానంగా ఉష్ణాన్ని గ్రహించి నెమ్మదిగా ఆవిరిగా మారి చుట్టూ ఆక్సిజన్ లేకుండా చేస్తుంది
3) వేడి నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత అధికం
4) వేడి నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత తక్కువ
8. నీటికి గరిష్ఠ సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది?
1) 00C 2) 10C 3) 2.0C 4) 40C
9. ఎ. సూర్యుడు లేదా నక్షత్రాల్లో ఉన్న అత్యధికమైన ఉష్ణోగ్రతను కొలవడానికి ఆప్టికల్ ఫైరోమీటర్ను ఉపయోగిస్తారు
బి. కాపర్, అల్యూమినియం, స్టీల్ అనేవి ఉష్ణ బంధకాలు
పై వాటిలో సరైనది ఏది?
1) బి 2) ఎ 3) ఎ, బి 4) ఏవీ కాదు
10. 400C వద్ద గల 500 మి.లీ. నీటిని, అంతే పరిమాణం గల 700C వద్ద గల నీటిని కలిపినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత విలువ?
1) 1100C 2) 550C
3) 300C 4) 650C
11. నెమ్మదిగా జరిగే ఉష్ణ ప్రసార ప్రక్రియ?
1) వహనం 2) సంవహనం
3) వికిరణం
4) అన్ని ప్రక్రియల్లో ఉష్ణం ఒకే వేగంతో ప్రసారం అవుతుంది
12. నీటి ఉష్ణోగ్రతను 80C నుంచి 00C వరకు చల్లారిస్తే నీటి ఘనపరిమాణంలో మార్పు ఏవిధంగా ఉంటుంది?
1) ఘనపరిమాణం క్రమంగా తగ్గుతుంది
2) సాంద్రత క్రమంగా పెరుగుతుంది
3) ఘనపరిమాణం మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
4) ఘనపరిమాణం మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
13. కింది వాటిని జతపరచండి.
ఎ. నీటి అసంగత వ్యాకోచం 1. 277K
బి. ఆరోగ్యవంత మానవుడు 2. 310K
సి. పాల పాశ్చరైజేషన్ 3. 340K
డి. మంచు ఉష్ణోగ్రత 4. 273K
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
14. వేగంగా జరిగే ఉష్ణ ప్రసార ప్రక్రియ?
1) వహనం 2) సంవహనం
3) వికిరణం
4) అన్ని ప్రక్రియల్లో ఉష్ణం ఒకే వేగంతో ప్రసారం అవుతుంది
15. అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
1) పైరోస్కోప్ 2) పైరోమీటర్
3) సిస్కోగ్రాఫ్ 4) క్సైలోమీటర్
16. నీరు మంచుగా మారేటప్పుడు ఏం జరుగుతుంది?
1) మొదట అడుగుభాగం మంచుగా మారుతుంది
2) మొదట పై భాగం మంచుగా మారుతుంది
3) మొత్తం ఒకేసారి మంచుగా మారుతుంది
4) మొదట మధ్యభాగం మంచుగా మారుతుంది
17. ఒక పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరపడం వల్ల ఉష్ణం ఏర్పడే ప్రక్రియను ఏమంటారు?
1) దహనం
2) వికిరణం/రేడియేషన్
3) ఫ్లేమింగ్/జ్వలనం
4) దహనం కానిది
18. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. నీటి అసంగత వ్యాకోచం వల్ల 40C వద్ద నీటికి కనిష్ఠ ఘనపరిమాణం, గరిష్ఠ సాంద్రత ఉంటుంది
బి. నీటి అసంగత వ్యాకోచం వల్ల మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీ కాదు
19. కింది వాటిలో ఏ ద్రవాన్ని 40C నుంచి 20Cకు చల్లబరిచినప్పుడు వ్యాకోచిస్తుంది?
1) నీరు 2) బెంజీన్
3) ద్రవ అమ్మోనియా 4) క్లోరోఫామ్
20. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వాటిలో ఏది ద్రవస్థితిలో ఉంటుంది?
1) పాదరసం 2) సోడియం
3) ఫాస్ఫరస్ 4) ఏదీ కాదు
21. థర్మోస్టాట్ అనే పరికరం దేనికి ఉపయోగపడుతుంది?
1) విద్యుత్ సాధనాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి
2) ఉష్ణోగ్రతను కొలవడానికి
3) ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడానికి
4) ఉష్ణాన్ని తయారు చేయడానికి
22. చెమట ఎక్కువగా ఎప్పుడు వస్తుంది?
1) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి పొడిగాలి ఉన్నప్పుడు
2) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమగాలి ఉన్నప్పుడు
3) ఉష్ణోగ్రత తక్కువగా ఉండి తేమగాలి ఉన్నప్పుడు
4) ఉష్ణోగ్రత తక్కువగా ఉండి పొడిగాలి ఉన్నప్పుడు
23. ద్రవాల్లో సాధారణంగా జరిగే ఉష్ణప్రసార ప్రక్రియ?
1) వహనం 2) సంవహనం
3) వికిరణం 4) 1, 2
24. ఒక సెల్సియస్ డిగ్రీ ఎన్ని ఫారన్ హీట్లకు సమానం?
1) 33.8 2) 32
3) 30.8 4) 28.3
25. కరిగించకుండానే ఘన పదార్థం, వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) సంక్షేపణం
3) ఉత్పతనం 4) నిక్షేపణ
26. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. సెల్సియస్, ఫారన్హీట్లు ఏకీభవించేది-40 డిగ్రీల వద్ద
బి. సెల్సియస్, కెల్విన్ మధ్య సంబంధం K=(c+273) కెల్విన్స్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
27. ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత దాదాపు?
1) 1000C 2) 800C
3) 1200C 4) 1100C
28. ఒక కెలోరి ఎన్ని జౌళ్లకు సమానం?
1) 4.18 2) 8.41
3) 1.84 4) 1.48
29. శక్తిని గ్రహించి సంభవించే జీవ ప్రక్రియను ఏమంటారు?
1) శక్తి గ్రాహక 2) ఉష్ణమోచక
3) ఉష్ణగ్రాహక 4) విచ్ఛిన్న క్రియ
30. ఉష్ణం అనేది ఒక?
1) బలం 2) శక్తి
3) సామర్థ్యం 4) సాపేక్ష భావన
31. థర్మామీటర్‌ను ఉపయోగించి దేన్ని కొలుస్తారు?
1) ఉష్ణోగ్రత 2) ఉష్ణశక్తి
3) విశిష్టోష్ణం 4) 2, 3
32. గదిలోని ఫ్రిడ్జ్ తలుపును తెరిచి ఉంచితే?
1) గది చల్లబడుతుంది
2) గది వేడెక్కుతుంది
3) గది ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు
4) గది మొదట వేడెక్కి తర్వాత చల్లబడుతుంది
33. నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం దాని ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అనే నియమం ఏది?
1) చార్లెస్ మొదటి నియమం
2) చార్లెస్ రెండో నియమం
3) బాయిల్ నియమం
4) కెల్విన్ నియమం
34. విద్యుత్తు కెటిల్లో నీరు వేడెక్కడానికి కారణం?
1) వహనం 2) సంవహనం
3) వికిరణం 4) 1, 3
35. సెంటిగ్రేడ్ ప్రమాణంలో నీరు మరిగే స్థాయిలో 1000 అయితే ఫారన్‌హీట్ ప్రమాణంలో అది ఎంత?
1) 1580 2) 1760
3) 1940 4) 2120
36. నీటి ఆవిరి వేడినీళ్ల కంటే ఎక్కువగా చర్మాన్ని కాల్చడానికి కారణం?
1) స్థితి మార్పులో ఆవిరి ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
2) స్థితి మార్పులో ఆవిరి తక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
3) స్థితి మార్పులో నీరు తక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
4) స్థితి మార్పులో నీరు ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
37. సెంటు సీసా మూత తీసినప్పుడు వాసన గది అంతటా తొందరగా వ్యాపించడానికి కారణం?
1) సెంటు ద్రవీభవన గుప్తోష్ణం అధికం
2) సెంటు ద్రవీభవన గుప్తోష్ణం తక్కువ
3) సెంటు బాష్పీభవన గుప్తోష్ణం అధికం
4) సెంటు బాష్పీభవన గుప్తోష్ణం తక్కువ
38. ప్రతిపాదన (ఎ): 40C వద్ద నీటిని వేడి చేసి చల్లబరిస్తే వ్యాకోచిస్తుంది
కారణం (ఆర్): చలికాలంలో వాహనాల్లోని రేడియేటర్లు పగలడానికి కారణం నీటి అసంగత వ్యాకోచం
1) ఎ, ఆర్ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ సరైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) ఆర్ మాత్రమే సరైనది
39. ఒక నిర్దిష్ట పరిమాణం గల నీటిని 00C నుంచి 100C వరకు వేడి చేస్తే దాని పరిమాణం?
1) క్రమంగా పెరుగుతుంది
2) క్రమంగా తగ్గుతుంది
3) పెరిగి, తర్వాత తగ్గుతుంది
4) తరిగి, తర్వాత పెరుగుతుంది
40. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్‌ను దేనితో తయారుచేస్తారు?
1) ఇనుము, ఇత్తడి 2) ఇనుము, రాగి
3) రాగి, ఉక్కు 4) ఇత్తడి, రాగి
41. సముద్ర మట్టపు స్థాయిలో నీరు ఫారన్‌హీట్ కొలమానంలో ఎన్ని డిగ్రీల వద్ద మసలిపోతుంది?
1) 100 డిగ్రీలు 2) 104 డిగ్రీలు
3) 212 డిగ్రీలు 4) 417 డిగ్రీలు
42. సెల్సియస్, ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతలు ఏ ఉష్ణోగ్రత వద్ద సమానంగా ఉంటాయి?
1) 2730 2) -2730
3) -400 4) 400
43. ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత ఎంత?
1) 39.40C 2) 370F
3) 98.40C 4) 98.40F
44. క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకం ఏది?
1) సిక్స్-గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రత మాపకం
2) పైరోమీటర్
3) సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
4) అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం
45. ఘన పదార్థాల్లో సాధ్యమయ్యే ఉష్ణ ప్రసారం?
1) వహనం 2) సంవహనం
3) వికిరణం 4) 1, 2
46. దేన్ని కొలవడానికి కెల్విన్ కొలమానం వాడుతారు?
1) కాంతి శక్తి 2) ఉష్ణోగ్రత
3) ధ్వని తీవ్రత 4) ఉష్ణ శక్తి
47. అత్యుత్తమ ఉష్ణవాహకం?
1) పాదరసం 2) నీరు
3) తోలు 4) బెంజీన్
48. పదార్థాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి దేన్ని వాడుతారు?
1) కెలోరి మీటర్
2) బాంబ్కెలోరి మీటర్
3) పైరోమీటర్ 4) బోలో మీటర్
49. ఉష్ణోగ్రత అనేది ఒక?
1) బలం 2) శక్తి
3) సామర్థ్యం 4) సాపేక్ష భావన
50. ప్రెషర్ కుక్కర్ వంట చేసే సమయాన్ని బాగా తగ్గిస్తుంది ఎలా?
1) వేడి చాలా సమంగా విభజించడం వల్ల
2) అత్యధిక ఉష్ణోగ్రత ఆహారాన్ని మెత్తబడేలా చేస్తుంది
3) కుక్కర్ లోపల మరిగేస్థితి అధికమవడం వల్ల
4) స్టౌ మంట పెద్దదిగా చేయడం వల్ల
జవాబులు
1. 2 2. 4 3. 1 4.3
5. 4 6.4 7.1 8.4
9.2 10.2 11.1 12.3
13.4 14.3 15.2 16.2
17.1 18.3 19.1 20.1
21.3 22.2 23.2 24.1
25.3 26.3 27.3 28.1
29.1 30.2 31.1 32.2
33.3 34.2 35.4 36.1
37.4 38.1 39.4 40.1
41.3 42.3 43.4 44.3
45.1 46.2 47.1 48.2
49.4 50.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు