Current Affairs | అంతర్జాతీయం
రికార్డు ధర
గుస్తావ్ క్లిమ్ట్ అనే ఆస్ట్రియన్ చిత్రకారుడు గీసిన చిత్రానికి రికార్డు ధర లభించింది. లండన్లోని సోథిబేలో జూన్ 27న జరిగిన వేలంలో ఆ చిత్రం 85.3 మిలియన్ పౌండ్ల (108.4 మిలియన్ డాలర్లు, భారత కరెన్సీలో రూ.885 కోట్లు)కు అమ్ముడుపోయింది. క్లిమ్ట్ చివరి చిత్రం ‘డేమ్ మిట్ ఫేచర్ (లేడీ విత్ ఫ్యాన్)’ పేరుతో గీశారు. ఆయన 1918లో మరణించిన తర్వాత, అతని చివరి చిత్రం అతని వియన్నా స్టూడియోలో కనుగొన్నారు.
ఎనర్జీ ట్రాన్సిషన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఎనర్జీ ట్రాన్సిషన్ (ఇంధన పరివర్తన) సూచీని జూన్ 28న విడుదల చేసింది. ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ సహకారంతో డబ్ల్యూఈఎఫ్ 120 దేశాలతో ఈ సూచీని రూపొందించింది. ఈ సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్ 2, నార్వే 3, ఫిన్లాండ్ 4, స్విట్జర్లాండ్ 5వ స్థానాల్లో నిలిచాయి. దీనిలో భారత్ 67వ స్థానంలో ఉంది. జీ20 నుంచి ఏకైక దేశంగా ఫ్రాన్స్ 7వ స్థానంలో నిలిచింది. అతిపెద్ద ఎకనామిక్ దేశాలైన జర్మనీ 11, అమెరికా 12, యూకే 13వ స్థానాల్లో ఉన్నాయి.
గెలాక్టిక్ 01
‘గెలాక్టిక్ 01’ పేరుతో మొదలుపెట్టిన మొదటి వాణిజ్య అంతరిక్ష ప్రయాణం వర్జిన్ గెలాక్టిక్ సబ్ఆర్బిట్ ప్లేన్ జూన్ 29న విజయవంతంగా పూర్తి చేసింది. ఇద్దరు ఇటాలియన్ వైమానిక దళాధికారులు, ఒక ఏరో స్పేస్ ఇంజినీర్, ఒక వర్టిన్ గెలాక్టిక్ ఇన్స్ట్రక్టర్, ఇద్దరు పైలట్లతో వీఎస్ఎస్ యూనిటీ స్పేస్ ప్లేన్ మెక్సికో ఎడారి నుంచి సుమారు 80 కి.మీ. పైకి ఎగిరింది. 75 నిమిషాల తర్వాత స్పేస్ ప్లేన్ సురక్షితంగా భూమిపైకి వచ్చి స్పేస్ పోర్ట్ అమెరికాలో ల్యాండ్ అయ్యింది. వర్జిన్ గెలాక్టిక్ అనేది 2004లో రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించిన అమెరికన్ స్పేస్ ఫ్లైట్ కంపెనీ.
ఎగిరే కారు
ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం జూన్ 30న ఆమోదం తెలిపింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి కూడా ప్రత్యేక ధ్రువీకరణ పొందింది. ఓ ఎగిరే కారుకు ఈ విధమైన అనుమతి లభించడం ఇదే తొలిసారి. అలెఫ్ అనే సంస్థ కాలిఫోర్నియా కేంద్రంగా ఈ కారును తయారు చేసింది. ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 177 కిలోమీటర్లు వరకు గాలిలో ప్రయాణించవచ్చు. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు నడుస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనమైన ఈ కారు ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ.2.46 కోట్లు). ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను అరికట్టేలా దీన్ని తయారు చేశారు. ఇప్పటి వరకు ఈ కార్ల కోసం 440కి పైగా ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?