Current Affairs | జాతీయం
హెమిస్ ఫెస్టివల్
సంప్రదాయ హెమిస్ ఫెస్టివల్‌ను లడఖ్‌లో జూన్ 28, 29 తేదీల్లో నిర్వహించారు. బౌద్ధమతానికి చెందిన లార్డ్ పద్మసంభవ (గురు రింపోచే) జయంతి సందర్భంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. టిబెటన్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జూన్‌లో గాని, జూలైలో గాని ఈ ఉత్సవాన్ని జరుపుకొంటారు. లేహ్ నగరంలో ఉన్న హెమిస్ గొంపాలో దీన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చేసే మాస్క్ నృత్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫెస్టివల్‌ను 1730 నుంచి నిర్వహిస్తున్నారు.
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్
LiFE (పర్యావరణానికి జీవనశైలి) అని పిలిచే స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ‘గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్’ కార్యాచరణను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ‘డ్రాఫ్ట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2023’ని జూన్ 28న ప్రవేశపెట్టింది. 2070 నాటికి భారత్ నెట్ జీరో లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని 2023-24 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం వ్యక్తులు, పరిశ్రమలు, రైతుల ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్-ఎఫ్‌పీవో)లు, పట్టణ, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్బన్ లోకల్ బాడీ (యూఎల్బీ), గ్రామ పంచాయతీలు, ప్రైవేట్ రంగాలు చెట్లను నాటడం, నీటిని సంరక్షించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి పర్యావరణ అనుకూల చర్యలను చేపట్టాలి.
ఫిష్ డిసీజ్ యాప్
ఆక్వా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘రిపోర్ట్ ఫిష్ డిసీజ్’ మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేసింది. ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ను కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల జూన్ 28న ప్రారంభించారు. చేపలకు వచ్చిన, వచ్చే అవకాశం గల వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ యాప్ ద్వారా మత్స్య శాఖ అధికారులు, సైంటిస్టుల నుంచి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను లక్నోలోని ఐసీఏఆర్-ఎన్బీఎఫ్జీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్) అభివృద్ధి చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను 2020, సెప్టెంబర్ 10న ప్రధాని మోదీ ప్రారంభించారు.
భౌగోళిక గుర్తింపు
ఉత్తరప్రదేశ్‌లోని 7 హస్తకళలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) జూన్ 28న లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీఐపీఐటీ) పరిధిలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (చెన్నై) ఈ జీఐ ట్యాగ్‌ను అందజేసింది. అమ్రోద్ ఢోలక్ (సహజ కలపతో తయారు చేసిన సంగీత వాయిద్యం), బాగ్పత్ హోమ్ ఫర్నిషింగ్స్ (చేనేత గృహోపకకరణాల ఉత్పత్తులు), బారాబంకి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, కల్పి హ్యాండ్‌మేడ్ పేపర్, మహోబా గౌర పత్తర్ హస్తాష్లిప్ (ప్రత్యేకమైన రాతి హస్తకళ. దీనిలో ఉపయోగించే రాయిని ‘పైరో ఫ్లైట్ స్టోన్’ అంటారు), మైన్‌పురి తార్కాషి (చెక్కపై ఇత్తడి తీగతో చేసే కళారూపం), సంభాల్ హార్న్ క్రాఫ్ట్ (చనిపోయిన జంతువుల కొమ్ములను ఉపయోగించి తయారు చేసే వస్తువులు) హస్తకళలు జీఐ ట్యాగ్ పొందాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు