Current Affairs | వార్తల్లో వ్యక్తులు
అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తి అజయ్ బంగా ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’ జాబితాలో చోటు సంపాదించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4 సందర్భంగా ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’ జాబితాను కార్నెగీ కార్పొరేషన్ జూన్ 29న విడుదల చేసింది. సామాజిక సేవ, విరాళాలు, ఇతర చర్యల ద్వారా అమెరికాను సుసంపన్నం చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది ఈ జాబితాలో ఈ గౌరవం పొందిన ఏకైక భారత వ్యక్తి అయ్ బంగా. అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రైమరీ విద్యను పూర్తి చేశారు. ఈ ఏడాది 33 దేశాలు, వివిధ నేపథ్యాలకు 35 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. స్కాటిష్ వలసదారు అయిన ఆండ్రూ కార్నెగీ కి నివాళిగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ప్రస్తుతం కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్‌ను ఐరిష్ వలసదారుడు డేమ్ లూయిస్ రిచర్డ్సన్ నడుపుతున్నారు. వియత్నాంలో జన్మించిన, ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ ఆస్కార్ పొందిన నటుడు హుయ్ క్వాన్, చిలీలో జన్మించిన ప్రసిద్ధ నటుడు పెడ్రో పాస్కల్, నైజీరియాలో జన్మించిన ఎన్గోజీ ఒకోంజో-ఇవెలా (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్), తైవాన్‌లో జన్మించిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు టెడ్ లియు, దక్షిణాఫ్రికాలోని బెనిన్‌లో జన్మించిన అంజెలిక్ కిడ్జో (యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్), పోలిష్ సంతతికి చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్, నోబెల్ గ్రహీత రోల్డ్ హాఫ్మన్, నెదర్లాండ్స్‌లో జన్మించిన ఎకనామిక్స్ ప్రొఫెసర్, నోబెల్ గ్రహీత గైడో ఇంబెన్స్ కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
హవోలియాంగ్ గ్జూ
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) అండర్ సెక్రటరీ జనరల్, అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా చైనాకు చెందిన హవోలియాంగ్ గ్జూ ను నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ జూన్ 26న ప్రకటించారు. ఇంతకుముందు ఈ పదవిలో భారత్‌కు చెందిన ఉషారావు మోనారి ఉన్నారు. హవోలియాన్ 2013 నుంచి 2019 వరకు యూఎన్డీపీ బ్యూరో ఫర్ పాలసీ అండ్ ప్రోగ్రామ్ సపోర్ట్‌కు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అండ్ డైరెక్టర్‌గా, ఆసియా పసిఫిక్ రీజినల్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. యూఎన్డీపీని 1956లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
అజయ్ భట్నాగర్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పెషల్ డైరెక్టర్‌గా అజయ్ భట్నాగర్ జూన్ 28న నియమితులయ్యారు. ఆయన 1989 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ ఐపీఎస్ అధికారి. అదేవిధంగా అనురాగ్, మనోజ్ శశిధర్ అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి పొందారు. అనురాగ్ 1994 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐపీఎస్ అధికారి. మనోజ్ శశిధర్ 1994 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్.
మైఖేల్ రోసెన్
ప్రఖ్యాత బ్రిటిష్ బాలల రచయిత మైఖేల్ రోసెన్‌కు ప్రతిష్ఠాత్మక ‘పెన్ పింటర్ ప్రైజ్ 2023’ జూన్ 28న లభించింది. నిజాన్ని నిర్భయంగా బహిర్గతం చేసిన యూకే, ఐర్లాండ్, కామన్వెల్త్‌లకు చెందిన ఈ రచయితకు ఈ గౌరవం దక్కింది. అతను 140కి పైగా పిల్లల పుస్తకాలను రచించాడు. ఆయన ఈ అవార్డు అక్టోబర్‌లో అందుకోనున్నారు. 2009లో ఈ అవార్డును స్థాపించారు. గతంలో ఈ అవార్డు హనీఫ్ ఖురేషి (2010), సల్మాన్ రష్డీ (2014), లెమ్న్ సిసే (2019), మలోరీ బ్లాక్‌మన్ (2022)లకు లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు