Sports Current Affairs | క్రీడలు
సిక్కిరెడ్డి జోడీ
మే 21న జరిగిన స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింగిల్స్‌లో భారత షట్లర్ సమీర్ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. సమీర్ లి యాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ.99 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. అదేవిధంగా ఈ టోర్నీలో తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-రోహాన్ జంట జాస్పెర్ టాఫ్ట్-క్లారా గ్రాసెరెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.
నామ్‌దేవ్
తైక్వాండో ఇండియా అధ్యక్షుడిగా నామ్‌దేవ్ షిర్గావ్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్‌కు మే 21న ముంబైలో ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన ఈయనకు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. అదేవిధంగా ఈ కమిటీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వీణా అరోరా (పంజాబ్), వైస్ ప్రెసిడెంట్‌గా పీ సోక్రటీస్ (తమిళనాడు), సెక్రటరీ జనరల్‌గా అమిత్ ధమాల్ (మహారాష్ట్ర), ట్రెజరర్‌గా రజత్ ఆదిత్య దీక్షిత్ (ఉత్తరప్రదేశ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా గీతికా తాలూక్దార్ (అసోం), వికాస్ కుమార్ వర్మ (గుజరాత్) ఎన్నికయ్యారు.
గనీమత్, దర్శన
వరల్డ్ కప్ షాట్‌గన్ చాంపియన్‌షిప్ ఉమెన్ స్కీట్‌లో భారత మహిళా షూటర్లు గనీమత్ సేఖో, దర్శన రాథోడ్ రజత, కాంస్య పతకాలు సాధించారు. అజర్‌బైజాన్‌లోని బాకులో మే 23న నిర్వహించిన 60 షాట్ల ఫైనల్లో అసెమ్ ఒరిన్ బే (కజకిస్థాన్), గనీమత్ 50 పాయింట్లతో సమ ఉజ్జీలుగా నిలిచారు. స్వర్ణ, రజత పతకాల కోసం రెండు షాట్ల ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఒరిన్ బే రెండు పాయింట్ల స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. గనీమత్ ఒక పాయింట్ సాధించి రజతం దక్కించుకుంది. దర్శన 39 పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. దీంతో షూటింగ్ ప్రపంచ కప్ మహిళల స్కీట్‌లో రెండు పతకాలు గెలవడం భారత్ ఇదే తొలిసారి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు