Current Affairs | అంతర్జాతీయం
ఎక్స్ ఖాన్ క్వెస్ట్
మల్టీనేషనల్ పీస్‌కీపింగ్ జాయింట్ ఎక్సర్సైజ్ ‘ఎక్స్ ఖాన్ క్వెస్ట్ 2023’ ను మంగోలియా లో ఆ దేశాధ్యక్షుడు ఉఖ్నాగీన్ ఖురెల్సుఖ్ జూన్ 19న ప్రారంభించారు. దీనిలో 20 దేశాల సైనిక దళాలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. 14 రోజులు చేపట్టే ఈ ఎక్సర్సైజ్ను మంగోలియా ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎంఏఎఫ్), యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ పసిఫిక్ కమాండ్ (యూఎస్ఏఆర్పీఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనే దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడం, అనుభవాన్ని పంచుకోవడం దీని లక్ష్యం. ఇందుకు దళాలకు యునైటెడ్ నేషన్స్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్ (యూఎన్పీకేవో) శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ యూఎన్వో శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్లో భారత్ నుంచి గర్వాల్ రైఫిల్స్ బృందం పాల్గొంది.
ఇంటెల్-జర్మనీ
ఇంటెల్ కంపెనీ ఐరోపా విస్తరణలో భాగంగా జర్మనీలోని మాగ్డేబర్గ్‌లో రెండు చిప్ తయారీ ప్లాంట్లను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు 30 బిలియన్ యూరో (33 బిలియన్ డాలర్లు)ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ ప్రభుత్వంతో జూన్ 19న ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటెల్ కంపెనీ 2022లో తూర్పు జర్మనీలోని మాగ్డేబర్గ్‌లో చిప్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని కొనుగోలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ తయారీ 2023 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఎస్టోనియా
యూరప్‌లోని ఎస్టోనియా దేశం స్వలింగ వివాహానికి అనుమతిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ జూన్ 20న ఆమోదించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆ దేశంలో స్వలింగ వివాహం అమల్లోకి రానుంది. ఈ చట్టం చేసిన మధ్య ఐరోపాలోని మొదటి దేశంగా నిలిచింది. పశ్చిమ ఐరోపాలో చాలా భాగం ఇప్పటికే స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసినప్పటికీ, సోవియట్ నేతృత్వంలోని వార్సా ఒప్పందంలో భాగంగా మధ్య ఐరోపా దేశాల్లో దీన్ని నిషేధించారు.
వరల్డ్ రెఫ్యూజీ డే
ప్రపంచ శరణార్థుల దినోత్సవం (వరల్డ్ రెఫ్యూజీ డే)ను జూన్ 20న నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంఘర్షణ, హింస లేదా బీభత్సం కారణంగా ఇళ్లను వదిలి వెళ్లిపోయిన వ్యక్తుల బలం, ధైర్యం, స్థితిస్థాపకతను గౌరవించే వేదికగా ఇది ఉపయోగపడుతుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2000, డిసెంబర్ 4న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. శరణార్థుల స్థితిపై 1951లో నిర్వహించిన కన్వెన్షన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా 2001, జూన్ 20 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘హోప్ అవే ఫ్రం హోమ్’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?