Current Affairs | వార్తల్లో వ్యక్తులు

రవిసిన్హా
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) చీఫ్‌గా రవి సిన్హాను నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ కమిటీ జూన్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 1988 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐపీఎస్ అధికారి. రాలో సెకండ్ ఇన్ కమాండ్‌గా ఉన్నారు. ప్రస్తుత రా చీఫ్ గోయల్ పదవీ కాలం జూన్ 30తో ముగియనున్నది.
అమిత్ అగర్వాల్
ఆధార్ కార్డులు జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవోగా అమిత్ అగర్వాల్ జూన్ 19న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1993 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేశారు.
జానకీరామన్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకీరామన్‌ను జూన్ 20న కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీకాలం జూన్ 20తో ముగిసింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా పని చేస్తున్న జానకీరామన్ ఈ పదవికి నియమితులయ్యారు.
పెటెరి ఓర్పో
ఫిన్లాండ్ నూతన ప్రధానిగా పెటెరి ఓర్పో జూన్ 20న ఎన్నికయ్యారు. ఆయన నేషనల్ కొలిషన్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన నాయకుడు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని సనా మారిన్‌కు చెందిన సెంటర్ లెఫ్ట్ పార్టీ మూడో బలమైన పార్టీగా ఉద్భవించింది. అప్పుడు ఓర్పో ఆధ్వర్యంలో కొత్త మితవాద సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారాల తరబడి సాగిన చర్చల తర్వాత చట్టసభ సభ్యులు ఓర్పోకు అనుకూలంగా 107, వ్యతిరేకంగా 81 మంది ఓటు వేశారు. 11 మంది గైర్హాజరయ్యారు.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు