National Current Affairs | జాతీయం
ఎస్‌యూఐటీ
సౌర వాతావరణ పరిశీలనకు తయారు చేసిన ‘సన్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ)’ను పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) అభివృద్ది చేసినట్లు ప్రొఫెసర్లు ఏఎన్ రాంప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి జూన్ 18న వెల్లడించారు. వారు దీన్ని ఇస్రోకు అందజేశారు. ఆదిత్య- ఎల్1 మిషన్‌లో భాగంగా ఈ టెలిస్కోప్ సూర్యుని వైపు దాదాపు 15 లక్షల కి.మీ. ప్రయాణించనుంది.
చాన్స్‌లర్ సీఎం
పంజాబ్‌లోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ల స్థానంలో ముఖ్యమంత్రి ఉంటారు. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ జూన్ 20న ఆమోదించింది. అదేవిధంగా డీజీపీ ఎంపికలో యూపీఎస్సీ పాత్రను తప్పించే బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించే కమిటీ ముగ్గురు ఐపీఎస్‌లను ఈ పోస్టు కోసం ప్రతిపాదిస్తుంది. వీరి నుంచి ప్రభుత్వం ఒకరిని ఎంపిక చేస్తుంది. అలాగే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పఠించే గుర్బానీ ప్రసార హక్కులు ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిక్కు గురుద్వారా చట్టం-1925కు సవరణ బిల్లును కూడా ఆమోదించింది.
ధ్రువ్
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ (ఐఎస్సీ) ‘ధ్రువ్’ను జూన్ 21న ప్రారంభించారు. కొచ్చిలోని సదరన్ కమాండ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఐఎస్సీ ధ్రువ్ స్వదేశీ నిర్మిత అత్యాధునిక సిమ్యులేటర్లను కలిగి ఉంది. ఇది భారత నావికా దళానికి, స్నేహపూర్వక దేశాల నేవీ సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏఆర్ఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన షిప్ హ్యాండ్లింగ్ సిమ్యులేటర్లను 18 దేశాలకు ఎగుమతి చేశారు.
యూనిటీ మాల్
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో నిర్మించనున్న యూనిటీ మాల్‌కు రూ.145 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా జూన్ 21న వెల్లడించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (వోడీవోపీ)ను ప్రోత్సహించేందుకు ఈ యూనిటీ మాల్‌ను నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా యూనిటీ మాల్ల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఈ మాల్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కొహిమాలో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) డ్రైవ్‌ను నిర్వహించి ప్రత్యేకంగా మిరప సాగుపై దృష్టిసారించింది.
లింగ సమానత్వ సూచీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023కు జూ 21న విడుదల చేసిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారత్ 127వ స్థానంలో నిలిచింది. దీనిలో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉండగా.. నార్వే 2, ఫిన్లాండ్ 3, న్యూజిలాండ్ 4, స్వీడన్ 5వ స్థానాల్లో ఉన్నాయి. ఐస్లాండ్ ఈ సూచీలో వరుసగా 14 ఏండ్ల నుంచి అగ్రస్థానంలో నిలుస్తుంది. బంగ్లాదేశ్ 59, భూటాన్ 103, చైనా 107, శ్రీలంక 115, నేపాల్ 116, పాకిస్థాన్ 142వ స్థానాల్లో నిలిచాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?