అంతర్జాతీయం 15-06-2022
పర్యావరణ దినోత్సవం
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న నిర్వహించారు. ఈ 50వ పర్యావరణ దినోత్సవాన్ని స్వీడన్ నిర్వహించింది. పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి అవగాహన పెంచుకోవడం, ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఓన్లీ వన్ ఎర్త్ (ఒకే ఒక భూమి)’.
వీగిన అవిశ్వాసం
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జూన్ 6న నిర్వహించిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ‘పార్టీగేట్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్‌పై సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 211 మంది జాన్సన్‌కు అనుకూలంగా, 148 మంది వ్యతిరేకంగా ఓటువేయడంతో అవిశ్వాసం వీగిపోయింది.
నాటో ఎక్సర్సైజ్
నాటో సభ్యదేశాల నౌకాదళ ఎక్సర్సైజ్ను బాల్టిక్ సముద్రంలో బాల్టిక్ ఆపరేషన్స్ (బీఏఎల్టీఓపీఎస్-22)జూన్ 5 నుంచి ప్రారంభించారు. ఆతిథ్య దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్లతో కలిపి మొత్తం 16 దేశాలు దీనిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ దేశాల నుంచి 45 నౌకలు, 75కు పైగా విమానాలు, 7,500 మంది సిబ్బందితో ఈ ఎక్సర్సైజ్ను రెండు వారాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ 1972లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం నిర్వహించే ఎక్సర్సైజ్ 51వది.
ఆహార భద్రతా దినోత్సవం
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7న నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్ఏవో) సంయుక్తంగా ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అసురక్షిత ఆహారంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేయడం దీని లక్ష్యం. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018, డిసెంబర్ 20న నిర్ణయించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘సేఫర్ ఫుడ్, బెటర్ హెల్త్ (సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం)’.
ఎక్స్ ఖాన్ క్వెస్ట్
మల్టీనేషనల్ శాంతి పరిరక్షక మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఎక్స్ ఖాన్ క్వెస్ట్-2022’ మంగోలియాలో జూన్ 6న ప్రారంభమయ్యింది. 16 దేశాలు 14 రోజులు నిర్వహించే ఈ ఎక్సర్సైజ్ను ఆ దేశాధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురేల్సుఖ్ ప్రారంభించారు. దీనిలో పాల్గొన్న భారత సైన్యానికి లఢక్ స్కౌట్స్ బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, శాంతి పరిరక్షక సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం.
వరల్డ్ ఓషియన్ డే
యూఎన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఓషియన్ డే (ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం)ని జూన్ 8న నిర్వహించారు. మహాసముద్రాల ప్రాధాన్యం, దైనందిన జీవితంలో అవి పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 1992లో రియో డి జనీరో (బ్రెజిల్)లో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో ప్రతిపాదించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘రివిటలైజేషన్: కలెక్టివ్ యాక్షన్ ఫర్ ది ఓషియన్ (పునరుజ్జీవనం: మహాసముద్రం కోసం సామూహిక చర్య)’.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?