అంతర్జాతీయం 01/06/2022
బయోడైవర్సిటీ డే
ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహించారు. పర్యావరణం, భూమిపై నివసించే అన్ని జాతుల గురించి అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 22ని అంతర్జాతీయ జీవవైవిధ్య దినంగా నిర్వహించాలని 2000, డిసెంబర్లో ప్రకటించింది. ఈ సంవత్సర దీని థీమ్ ‘అన్ని ప్రాణుల కోసం భాగస్వామ్య భవిష్యత్తును నిర్మించడం (బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్)’.
ఐపీఈఎఫ్‌లో భారత్
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)ను అధికారికంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మే 23న జపాన్‌లో ఆవిష్కరించారు. దీనిని అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చారు. మొత్తం 13 సభ్యదేశాలు ఉన్నాయి. అవి.. భారత్, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేషియా, జపాన్, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, వియత్నాం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా.
క్వాడ్ కూటమి
4వ క్వాడ్ కూటమి (చతుర్భుజ కూటమి) ప్రతినిధుల సమావేశం జపాన్ రాజధాని టోక్యోలో మే 24న నిర్వహించారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ తీరంలో రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం అంశాలపై చర్చించారు. ఇది 2007లో ఏర్పడింది.
పర్యాటక ప్రాంతాల సూచీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ది ట్రావెల్ అండ్ టూరిజమ్ డెవలప్మెంట్ ఇండెక్స్ (టీటీడీఐ)’ను మే 23న విడుదల చేసింది. 117 దేశాలకు చెందిన ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి నివేదికలో జపాన్ మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా 2, స్పెయిన్ 3, ఫ్రాన్స్ 4, జర్మనీ 5, స్విట్జర్లాండ్ 6, ఆస్ట్రేలియా 7, యూకే 8, సింగపూర్ 9, ఇటలీ 10వ స్థానాల్లో నిలిచాయి. – భారత్ 54, శ్రీలంక 74, పాకిస్థాన్ 83, చాద్ 117వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27.
నేవీ విన్యాసాలు
భారత్-బంగ్లాదేశ్ నావికా విన్యాసాలు బంగ్లాదేశ్‌లోని పోర్ట్ మోంగ్లాలో మే 24, 25 తేదీల్లో నిర్వహించారు. ‘బొంగోసాగర్’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాలు మే 26, 27 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో కూడా చేపట్టారు. ‘అధిక స్థాయి ఇంటరాపరబిలిటీ, ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం’ లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ కోరా యుద్ధనౌకలు, బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్ఎస్ హైదర్, బీఎన్ఎస్ అబు ఉబైదా యుద్ధనౌకలు పాల్గొన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?