జాతీయం 01/06/2022
ఆర్టికల్ 142
ఆర్టికల్ 142ను ఉపయోగించి ఏజీ పెరారివాలన్ (తమిళనాడు)ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మే 18న ఆదేశించింది. 1991, మే 21న రాజీవ్‌గాంధీ హత్యకేసులో అతడు అరెస్టయ్యాడు. 19 ఏండ్ల వయస్సులో అరెస్టయిన అతడు 31 ఏండ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
రస్కిన్ బాండ్ పుస్తకావిష్కరణ
రస్కిన్ బాండ్ రచించిన ‘లిజన్ టు యువర్ హర్ట్: ది లండన్ అడ్వెంచర్’ అనే పుస్తకాన్ని తన 88వ పుట్టిన రోజు సందర్భంగా మే 19న విడుదల చేశారు. ఈపుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఇండియా (పీఆర్‌హెచ్‌ఐ) ప్రచురించింది. చానల్ ఐలాండ్, ఇంగ్లండ్‌లో గడిపిన నాలుగు సంవత్సరాలను ఈ పుస్తకంలో వివరించాడు. సాహిత్య అకాడమీ, జాన్ లెవెల్లిన్ రైస్ ప్రైజ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను పొందాడు. అతడి మొదటి పుస్తకం ‘ది రూమ్ ఆన్ ది రూఫ్’.
మొదటి నగరం కోల్‌కతా
దేశంలోనే జీవవైవిధ్య వివరణాత్మక రిజిస్టర్‌ను రూపొందించిన తొలి మెట్రో నగరంగా కోల్‌కతా నిలిచింది. దీనికి సంబంధించి కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ‘పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ (పీబీఆర్)’ను మే 25న విడుదల చేసింది. దీనిలో నగరంలోని పుష్ప, జంతు జాతులతో పాటు దాని వినియోగం, మానవ కార్యకలాపాల గురించి వివరించారు. ఈ రిజిస్టర్లో 138 రకాల చెట్లు, 26 రకాల చైనీస్ కూరగాయలు, 33 రకాల ఔషధ మొక్కలు, 100 ఇతర వృక్ష జాతులను నమోదు చేశారు.
లిల్లీ ఫెస్టివల్
మణిపూర్ రాష్ట్రం ఉఖ్రుల్ జిల్లాలోని షిరుయ్ గ్రామంలో లిల్లీ పూల 4వ ఉత్సవాన్ని మే 26 నుంచి నాలుగురోజుల పాటు నిర్వహించారు. షిరుయ్ లిల్లీ పూలు మే చివరి నుంచి జూన్ ప్రారంభం వరకు షిరుయ్ గ్రామంలోని కొండపై మాత్రమే పూస్తాయి. ప్రపంచంలో ఎక్కడా వీటిని నాటడం సాధ్యం కాదు. అరుదైన ఈ పూల గురించి అవగాహన కల్పించేందుకు, మణిపూర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్. గవర్నర్ లా గణేశన్.
బిమల్ జలాన్ పుస్తకావిష్కరణ
ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ రాసిన ‘ది ఇండియా స్టోరీ’ పుస్తకాన్ని మే 26న ఆవిష్కరించారు. ఈ-విధానాలు అమలు చేయడంలో పాలన పాత్రపై విశ్లేషించారు. ఇతను రచించిన పుస్తకాలు ‘ఇండియా దెన్ అండ్ నౌ, ఇండియా ఎహెడ్’.
ఐఎన్ఎస్ నిర్దేశక్
నాలుగు దిశల సర్వే యుద్ధనౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను మే 27న కట్టుపల్లి (తమిళనాడు)లో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ షిప్‌బిల్డింగ్ సహకారంతో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) ఈ నిర్దేశక్‌ను తయారు చేసింది. సర్వే వెజెల్స్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నాలుగు పెద్ద నౌకల్లో ఇది రెండోది.
- Tags
- Current Affairs
- national
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?