ద్రౌపది ముర్ము భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతి ? ( వార్తల్లో వ్యక్తులు)
ద్రౌపది ముర్ము
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై 21న ఎన్నికయ్యారు. ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళగా, రెండో మహిళగా, అతి తక్కువ వయస్సున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆమె 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బెడా గ్రామంలో జన్మించారు.
ఆశిష్ కుమార్
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్ కుమార్ హాన్ జూలై 17న ఎంపికయ్యారు. గత ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే పదవీకాలం జూలై 16తో ముగిసింది.
జస్టిస్ వినీత్ శరణ్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కి ఎథిక్స్ ఆఫీసర్ అండ్ అంబుడ్స్‌మన్‌గా జూలై 19న నియమితులయ్యారు. అంతకుముందు ఈ పదవిలో జస్టిస్ డీకే జైన్ ఉన్నారు. వినీత్ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక, అలహాబాద్ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా.
భూపిందర్ సింగ్
ప్రముఖ గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ జూలై 18న ముంబైలో మరణించారు. ఆయన 1940, ఫిబ్రవరి 6న జన్మించారు.
కౌశిక్ రాజశేఖర
భారత సంతతి వ్యక్తి కౌశిక్ రాజశేఖర ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎనర్జీ అవార్డుకు జూలై 21న ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటప్పుడు విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకు ఈ అవార్డు లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?