అత్యధిక నిల్వలు – ఆహార కొరత!
కరెంట్ ఎఫైర్స్
‘ఆహార భద్రతా సమాచార నెట్వర్క్’, ‘ఆహార సంక్షోభాల వ్యతిరేక అంతర్జాతీయ నెట్వర్క్’ కలిసి ‘ఆహార సంక్షోభాలపై అంతర్జాతీయ నివేదిక-2022’ పేరుతో నివేదికను విడుదల చేసింది.
ఆహార సంక్షోభంపై అంతర్జాతీయ నివేదిక -2022
నివేదికలో ముఖ్యాంశాలు –
-2020 కంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రతను, సంక్షోభాలను మరో 40 మిలియన్ల మంది ప్రజలు ఎక్కువగా దారుణమైన స్థాయిలో ఎదుర్కొన్నారు. వీరిలో ఐదు లక్షల మంది వరకు ఇథియోపియా, దక్షిణ మడగాస్కర్, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాల్లో తీవ్రంగా ఆహార కొరతను, సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.
– ప్రపంచవాప్తంగా 53 దేశాలు లేదా ప్రాంతాల్లోని 193 మిలియన్ల మంది ప్రజలు అంతకుమందు ఏడాది కంటే 2021లో అత్యధికంగా ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు.ఇందుకు ప్రధాన కారణాలు
ఘర్షణలు
– ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఘర్షణలు, యుద్ధాల కారణంగా ఆహార కొరతను ఎదుర్కొన్నారు. 2020లో 23 దేశాల్లో 99 మిలియన్ల మంది ఆహార అభద్రత ఎదుర్కొన్నారు.
వాతావరణ మార్పులు
-2021లో వాతావరణంలో తీవ్రమైన, విపరీత మార్పుల కారణంగా ఎనిమిది దేశాల్లో 23 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరత లేదా అభద్రత ఎదుర్కొన్నారు. అంతకుముందు ఏడాది 2020లో 15 దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఇలాంటి కొరత ఎదుర్కొన్నారు.
ఆర్థిక పరమైన సమస్యలు
-2021లో 21 దేశాల్లో 30 మిలియన్ల మంది ప్రజలు ఆర్థిక సమస్యల కారణంగా ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ఇది 2020 కంటే కొంచెం తక్కువ. 2020లో 17 దేశాల్లో 40 మిలియన్ల మంది ఈ సమస్యను
ఎదుర్కొన్నారు.
భారత్ ఆహార అభద్రత/కొరత స్థాయిలు
-‘ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహార పరిస్థితి-2021’ నివేదిక ప్రకారం- ప్రపంచంలో అత్యధిక ఆహారధాన్యాల నిల్వల గల దేశమైన భారత్ (2021 జూలై 1 నాటికి 120 మిలియన్ టన్నులు) ప్రపంచంలో ఆహార కొరతను లేదా అభద్రతను ఎదుర్కొంటున్న జనాభాలో పాతిక శాతాన్ని కలిగి ఉంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న ప్రజలు 237 కోట్ల మంది. ఇది 2019 కంటే 32 కోట్లు ఎక్కువ. ప్రపంచంలోని మొత్తం ఆహార కొరత లేదా అభద్రతలో 36 శాతం దక్షిణాసియా దేశాల్లోనే ఉంది.
భారత్ అమలు చేస్తున్న కార్యక్రమలు
1. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
2. ఒక దేశం – ఒక రేషన్ కార్డు
3. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన
4. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
5. తీవ్రతరమైన మిషన్ ఇంద్రధనుష్ – 3 పథకం
దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం
పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనా సముద్రం 35 లక్షల చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్ల విలుదైన వర్తకం ఆ సముద్రం మీదుగా సాగుతుంది. జపాన్, తైవాన్ దక్షిణ కొరియాలకు 80 శాతానికి పైగా ముడి చమురు ఆ మార్గంలోనే అందుతుంది. గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. మత్స్ సంపద, ముడిచమురు, గ్యాస్ నిల్వలు అపారంగా ఉన్న ఆ ప్రాంతాన్ని తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా దానిపై పూర్తి ఆధిపత్యాన్ని చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులన్నీ తనవేనని చైనా వాదిస్తుంది. చైనా ఆవిర్భావానికి ముందు 1947లో కొమింగ్టన్ హయాం లో రూపొందించిన మ్యూప్‌ను దానికి సాక్ష్యంగా చూపుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా పరిధిని తొమ్మిది గీతలతో ఆ పటం సూచిస్తుంది. తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియాల ఈఈజెడ్‌లు, పలు వివాదాస్పద దీవులు చైనా చూపిస్తున్న మ్యాప్ పరిధిలోకే వస్తాయి. అలా ఇరవై లక్షల కిలోమీటర్లకు పైగా సముద్ర ప్రాంతం వివాదాస్పదంగా మారింది. డ్రాగన్ ఆగడాలపై 2013 జనవరిలో ఫిలిఫ్పీన్స్ యూఎన్సీఎల్ఓఎస్లో భాగంగా ఏర్పాటయిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. చైనా చెప్తున్న పాతకాలం మ్యాప్ చెల్లదని ఆ ట్రిబ్యునల్ 2016లో తేల్చింది. ఆ తీర్పును పెడచెవిన పెట్టిన డ్రాగన్-తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో పౌర నౌకలకు తరచూ ఆటంకం కలిగిస్తుంది.
-అంతర్జాతీయ చట్టాలకు గండికొట్టేలా 2021 ఫిబ్రవరిలో చైనా నూతన సముద్ర పోలీసు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతాల్లోకి వచ్చే విదేశీ నౌకలపై చైనా తీర రక్షక దళం (సీసీజీ) మారణాయుధాలను ప్రయోగించే అవకాశం కల్పించడం దాని ప్రధాన ఉద్దేశం.
యూఎన్సీఎల్ఓఎస్(UNCLOS)
– సముద్ర చట్టంపై ఐక్యరాజ్య సమితి ఒడంబడిక ప్రకారం చైనాకు దాదాపు 30 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర భూభాగాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో 200 నాటికల్ మైళ్ల ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) అందులో భాగం. ఈఈజెడ్ పరిధిలో మత్స్య సంపద, ముడి చమరు, ఇతర ఖనిజ వనరుల అన్వేషణ, సమీకరణలకు డ్రాగన్ దేశానికి సార్వభౌమ హక్కులున్నాయి. ప్రాదేశిక సముద్రంలో 12 నాటికల్ మైళ్లదాకా అది తన కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు
– రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్‌లోని చమరు శుద్ధి కర్మాగారాలు 2022 మే నెలలో భారీగా పెంచాయని అంతర్జాతీయ ఇంధన, పరిశుభ్ర వాయు పరిశోధనా సంస్థ (సెంటర్ ఫర్ రిసెర్చ్
ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) నివేదిక జూన్ నెలలో వెల్లడించింది.
– యూరోపియన్ యూనియన్ దేశాలకు రష్యా నుంచి ముడిచమురు ఎగుమతులు మే నెలలో 18 శాతం తగ్గిపోతాయి. అయితే ఈ చమురు వాటి స్థానంలో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. అందువల్ల రష్యా ఎగుమతుల్లో పెద్దగా తేడా రాలేదు. ప్రత్యేకించి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మే నెలలో పెంచింది.
-మే నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో 16.5 శాతం రష్యా నుంచి వచ్చినదే. ఇస్లామిక్ దేశాల సంస్థ ద్వారా వచ్చిన దిగుమతులు కూడా 20.5 శాతానికి పెరిగాయి. మధ్య తూర్పు దేశాల నుంచి వచ్చిన చమురు దిగుమతులు 59.5 శాతానికి తగ్గాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా మే నెలలో 11.5 శాతానికి పెరిగాయి. ఏప్రిల్‌లో ఇవి 5.9 శాతం మాత్రమే.
-2022 మే నెలలో భారత్ దిగుమతులు రోజుకు 4.98 మిలియన్ బారెళ్లు. 2020 డిసెంబర్ తర్వాత ఇదే
అత్యధికం. ఇది ఏప్రిల్ నెల కంటే 5.6 శాతం ఎక్కువ. 2021 సంవత్సరం మే నెల కంటే 19 శాతం ఎక్కువ.
– విశేషం ఏమిటంటే జామ్ నగర్ చమురు శుద్ధి కర్మాగారంలో ఈ చమురును శుద్ధి చేసి తిరిగి బయటి దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ కర్మాగారం నుంచి బయటకు వెళ్తున్న శుద్ధి చేసిన చమురులో 25 శాతం సూయజ్ కాలువ గుండా ఎగుమతి అవుతోంది. అంటే యూరప్ అమెరికా దేశాలకు వెళ్తుంది. ఈ చమురు రవాణా నౌకలు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, యూకే దేశాలకు వెళ్తున్నాయని గుర్తించినట్లు పై నివేదిక పేర్కొంది.
-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత రష్యా నుంచి 93 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాలు ఎగుమతి అయ్యాయని పై నివేదిక వెల్లడించింది. రష్యాలో ఇంధన ఎగుమతుల నుంచి వచ్చిన ఆదాయంలో 63 శాతం చమురు సంబంధిత ఉత్పత్తుల నుంచి, 32 శాతం సహజ వాయువు నుంచి 5 శాతం బొగ్గు నుంచి వచ్చిందని నివేదిక పేర్కొంది.
ప్రాక్టీస్ బిట్స్
1. భారతీయ రైల్వేల ఇటీవల ప్రకటించిన థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైలు ఏది?
1) భారత్ పర్వ్ 2) భారత్ హింద్
3) భారత్ మదద్ 4) భారత్ గౌరవ్
2. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో అంతర్జాతీయ విమానాశ్రయం?
1) 4 2) 5 3) 6 4) 3
3. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ ప్రకారం భారతదేశం జీడీపీ వృద్ధి రేటు అంచనా శాతం ఎంత?
1) 9.3 2) 8.7 3) 10.1 4) 7.6
4. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ఎప్పటి వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం 2021 నవంబర్ చివరి వారంలో ఆమోదం తెలిపింది?
1) జూలై 2022 2) జనవరి 2022
3) మే 2022 4) మార్చి 2022
5. 2021లో 13వ అసెమ్ శిఖరాగ్ర సదస్సు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
1) థాయ్‌లాండ్ 2) సింగపూర్
3) కంబోడియా 4) దక్షిణ కొరియా
6. వేతన రేటు సూచిక కోసం ప్రభుత్వం ఆధారిత సంవత్సరాన్ని మార్చింది. అయితే కొత్త బేస్ ఇయర్ ఏది?
1) 2018 2) 2020
3) 2014 4) 2016
7. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 26 నవంబర్ 2) 25 నవంబర్
3) 24 నవంబర్ 4) 22 నవంబర్
8. విపత్తు నిర్వహణపై 5వ ప్రపంచ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది?
1) హైదరాబాద్
2) ముంబై
3) ఢిల్లీ 4) గువాహటి
9. సురక్షితమైన, సమర్థమంతమైన కొవిడ్ వ్యాక్సిన్‌ను పొందడం కోసం భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి ఏ ఆర్థిక సంస్థ ఆమోదం తెలిపింది?
1) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
2) వరల్డ్ బ్యాంక్
3) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
4) యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్
10. ఎవరి జయంతిని పురస్కరించుకొని నవంబర్ 26న భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1) సీ రంగనాజన్
2) ఎం ఎస్ స్వామినాథన్
3) నార్మన్ బోర్లాగ్
4) డాక్టర్ వర్గీస్ కురియన్
11. నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో/యూటీ లో తేజశ్విని, హోసాలా పథకాలు.. శిఖర్, శికర పథకాలను ప్రారం-భించింది?
1) అస్సాం 2) మణిపూర్
3) డామన్ అండ్ డయ్యూ
4) జమ్ముకశ్మీర్
12. భారతదేశం ఏ దేశం మధ్య కార్పాట్ 37వ ఎడిషన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరిగింది?
1) రష్యా 2) బంగ్లాదేశ్
3) ఇంగ్లండ్ 4) ఇండోనేషియా
13. ‘కంటెస్టెడ్ ల్యాండ్స్- ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ పేరుతో ఎవరు పుస్తకాన్ని రాశారు?
1) షాఫీ కిద్వాయ్ 2) జుంపా లహిరి
3) కవేరీ బంజాయ్ 4) మరూఫ్ రజా
14. 2021 నవంబర్‌లో ఏ దేశం షేక్ సబాహ్ అల్ ఖలెద్ అల్ హమద్ అల్ సబామ్ను తన కొత్త ప్రధానిగా నియమించింది?
1) కువైట్ 2) యూఏఈ
3) ఒమన్ 4) యెమెన్
15. ఇంటర్‌పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) వివేక్ మిశ్రా 2) ప్రవీణ్ సిన్హా
3) ప్రియాంక అగర్వాల్
4) సోనియా శర్మ
16. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంటర్ స్వదేశ్ అనే ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీమోడల్ న్యూరోఇమేజింగ్ డేటాబేస్‌ను ప్రారంభించింది. అయితే డీబీటీ-ఎన్‌బీఆర్‌సీ ఎక్కడ ఉంది?
1) గుర్గావ్ 2) పుణె
3) హైదరాబాద్ 4) న్యూఢిల్లీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?