బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్స్ రాజధానిగా ప్రసిద్ధి చెందిన నగరం?
తెలంగాణ పారిశ్రామిక రంగం
1. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన ట్రావెల్స్గ్రంథంలో తెలంగాణలోని ఏ పరిశ్రమ గురించి పేర్కొన్నాడు?
ఎ) వరంగల్ డరిలు (జంపకానాలు)
బి) నిర్మల్ ఆర్ట్ వేర్
సి) పోచంపల్లి చీరలు
డి) పెంబర్తి లోహ హస్తకళ
2. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) లోహాలను తీగలుగా చుట్టి అద్భుతమైన ఆకారాన్ని ఇవ్వడమే ఫిలిగ్రి ఆర్ట్ ప్రత్యేకత
2) సిల్వర్ ఫిలిగ్రీ కళను ప్రవేశ పెట్టినవారు కడార్ల రామయ్య
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) ఏదీకాదు
3. వెండి నగిషీ పనులు (సిల్వర్ ఫిలిగ్రి) ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) కరీంనగర్ బి) పోచంపల్లి
సి) నిర్మల్ డి) సిద్దిపేట
4. సిల్వర్ ఫిలిగ్రి స్థానికంగా ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది?
ఎ) నిజ్ బి) నకాషి
సి) జాలి డి) మెరుపు తీగ
5. కింది వాటిలో ఏ ప్రాంతాన్ని కాటన్‌సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేర్కొంటారు?
ఎ) నల్లగొండ బి) పోచంపల్లి
సి) పెంబర్తి డి) గద్వాల
6. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరు?
ఎ) పరంధాములు బి) కడార్ల రామయ్య
సి) గజం గోవర్థన్ డి) ఎవరూకాదు
7. తెలంగాణ సిల్క్ సిటీగా ప్రసిద్ధి పొందిన ప్రాంతాన్ని గుర్తించండి?
ఎ) గద్వాల బి) పోచంపల్లి
సి) నిర్మల్ డి) కొత్తకోట
8. కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి?
1) నిర్మల్ పెయింటింగ్స్‌లోని డేకో పెయింటింగ్ ప్రత్యేకత
2) నిర్మల్ కళానైపుణ్యంలో ఇండియన్, మొఘల్స్ స్కూల్ ఆర్ట్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది
3) నిర్మల్ బొమ్మల తయారీకి పొనికి కరని వినియోగిస్తారు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 3
9. ఏనుగుల వీరస్వామి తన కాశీయాత్ర చరిత్రలో కింది వాటిలో ఏ కళను గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు?
ఎ) పెంబర్తి ఇత్తడి కళ
బి) గద్వాల్ వసా్త్రలు
సి) సిల్వర్ ఫిలిగ్రి
డి) నిర్మల్ బొమ్మలు, పంచపాత్రలు
10. నిర్మల్ ఆర్ట్వేర్కి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) నిమ్మయ నాయుడు బి) నిమ్మయ రావు
సి) కాపయ నాయుడు డి) వెలమ రాజులు
11. కిందివాటిని జతపరచండి.
పేపర్‌మిల్లు ప్రాంతం
1) ఏపీ రేయాన్ పరిశ్రమ ఎ) పటాన్ చెరువు
2) శ్రీరామ స్ట్రాబోర్డ్ లిమిటెడ్ బి) నేరుడుచర్ల
3) నాగార్జున పేపర్‌మిల్లు సి) కమలాపూర్
డి) భద్రాచలం పేపర్‌మిల్లు డి) సారపాక
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
12. కిందివాటిలో ఐటీసీ వారు చేజిక్కించుకున్న కాగితపు పరిశ్రమ ఏది?
ఎ) చార్మినార్ పేపర్ మిల్లు
బి) ఏపీ రేయాన్స్ పరిశ్రమ
సి) భద్రాచలం పేపర్‌మిల్లు
డి) తెలంగాణ పేపర్‌మిల్లు
13. తెలంగాణలోని పెంబర్తి ఏ కళకు ప్రసిద్ధి చెందింది?
ఎ) ఇత్తడికళ బి) పెయింటింగ్స్
సి) లోహపరిశ్రమ డి) ఏదీకాదు
14. కిందివాటిలో గొల్లభామ చీరలు ప్రధాన తయారీ ప్రాంతం ఏది?
ఎ) గద్వాల్ బి) పోచంపల్లి
సి) సిద్దిపేట డి) నిర్మల్
15. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) డోక్రమెటల్ క్రాఫ్ట్ నిజామాబాద్ జిల్లాలోని ఉషేగాల్ గ్రామం ప్రసిద్ధి
2) డోక్రా అనేది బెల్ మెటల్‌కు సంబంధించింది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) పైవేవీకావు
16. కింది వాటిలో డ్యాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజోదారోకు ఏ కళ ప్రసిద్ధి చెందినది?
ఎ) బిద్రి బి) డోక్రమెటల్
సి) నిర్మల్ ఆర్ట్ వర్క్ డి) చేర్యాల
17. భారతదేశంలో మొదటిసారిగా (2004- 05)లో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులను గుర్తించండి?
1) డార్జిలింగ్ టీ 2) పోచంపల్లి ఇక్కత్
3) ఆర్నముల కన్నడి 4) నాదస్వరం
ఎ) 1, 2, 3, 4 బి) 1 మాత్రమే
సి) 2, 3, 4 డి) 1, 2, 3
18. తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSHDC) ట్రేడ్ మార్క్ ఏది?
ఎ) లేపాక్షి బి) చార్మినార్
సి) గోల్కొండ ట్రేడ్ మార్క్
డి) దాము
19. తెలంగాణలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) ఏసీసీ 1958 – మంచిర్యాల
బి) దక్కన్ సిమెంట్ 1958 –సింహపురి
సి) నాగార్జున సిమెంట్ 1979 – జూర్ నగర్
డి) శ్రీ చక్ర సిమెంట్ 1959 – నల్లగొండ
20.కింది పరిశ్రమలను కాలక్రమంలో అమర్చండి?
1) హెచ్ఎంటీ 2) ఈసీఐఎల్
3) హెచ్ఏఎల్ 4) మిథానీ
5) బీహెచ్ఈఎల్
ఎ) 1, 2, 3, 4, 5 బి) 5, 3, 1, 2, 4
సి) 2, 3, 4, 1, 5 డి) 5, 3, 1, 4, 2
21. దేశంలో మొట్టమొదటి ఔషద నియంత్రణ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల
బి) బాలనగర్ హైదరాబాద్
సి) శామీర్‌పేట హైదరాబాద్
డి) పైవేవీకాదు
22. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డివైజస్ పార్క్‌ని ఎక్కడ ప్రారంభించారు?
ఎ) మల్కాజ్గిరి బి) సుల్తాన్పూర్
సి) సంగారెడ్డి డి) అమీన్పూర్
23. కిందివాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి?
1)TSCAN అంటే తెలంగాణ సెక్రటేరియేట్ క్యాంపస్ యాక్సెస్ నెట్వర్క్
2) SOFTNET అంటే సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్
3) TASK అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
4) SWAN స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్
ఎ) 4 బి) 2 సి) 3 డి) 1
24. కిందివాటిలో TSIC ఎవరి సహకారంతో గ్రామీణ ఆవిష్కరణలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు?
1) యునిసెఫ్ 2) ఇంక్విలాబ్ ఫౌండేషన్
3) యునెస్కో 4) ప్రథమ్
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 2, 3 డి) 1, 2
25. కిందివాటిలో ఎన్ని సరైన అంశాలో గుర్తించండి?
1) T- PRIDE- Telangana State Programme For Rapid Inqubation at Dalith Enterpreneurs
2) T-IDEA – తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అచీవ్మెంట్
3) T-HART – తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ ఆరిజన్స్
4) T-SIC – తెలంగాణ స్టేట్ ఇంటలెక్చువల్ సెల్
ఎ) 2 బి) 3 సి) 4 డి) 1
26. కిందివాటిలో ఆవిష్కరణలకు పరిశోధనలకు, వెంచర్ క్యాప్టిలిస్ట్లకు మధ్య అవసరమైన అనుసంధానతను ఏర్పాటు చేసే ప్రోగ్రామ్‌ను గుర్తించండి.
ఎ) T-BRADEE బి) T-SWAN
సి) RICH డి) T- వ్యాలెట్
27. కింది వాటిలో ప్రపంచంలోని వివిధ స్టార్టప్ లతో హైదరాబాద్ స్టార్టప్‌లను అనుసంధా నించే ఆలోచన ఏది?
ఎ) టి-బ్రిడ్జ్ బి) టి- స్వాన్
సి) రిచ్ డి) టి -హబ్
28. ఈ కిందివాటిలో టీ హబ్ భవనం పేరును గుర్తించండి.
ఎ) ఇన్నోవేటర్ బి) కాటలిస్ట్
సి) ఇంక్యుబేషన్ డి) స్టార్టప్
29. చిన్న, సూక్ష్మ పరిశ్రమకు కావాల్సిన ఉద్యోగ నైపుణ్యం పట్ల శిక్షణ కల్పించడం, ప్రస్తుత ఉద్యోగులకు, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం అభివృద్ధికి శిక్షణనిచ్చే సంస్థ కిందివాటిలో ఏది?
ఎ) TASK బి) ASSIST
సి) T Works డి) T-HUB
30. రాష్ట్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌ని (SEZ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే సంస్థ ఏది?
ఎ) టీఎస్ ఐ పాస్ బి) ఏపీఐసీసీ
సి) టీఎస్ ఐసీసీ డి) టీఎస్ఐసీ
31. ఈ కింది వాటిలో ఎన్ని అంశాలు సరైనవి? ఉత్తత్తి కేంద్రం ప్రాంతం
1) సబ్బుల తయారీ కేంద్రం – నిర్మల్
2) సోయ ప్రాసెసింగ్ యూనిట్ – కామారెడ్డి
3) తేనె శుద్ధి కేంద్రం – కామారెడ్డి
4) జిగురు శుద్ధి కేంద్రం – ములుగు
5) పసుపు తయారీ కేంద్రం – ఏటూరు నాగారం
ఎ) 4 బి) 5 సి) 3 డి) 2
32. భారతదేశంలో బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్స్’ రాజధానిగా ప్రసిద్ధి చెందిన నగరం.
ఎ) హైదరాబాద్ బి) పుణె
సి) పింప్రి డి) బెంగళూరు
33. కిందివాటిలో కార్పొరేటు సంస్థలు కోరుకునే నైపుణ్యాలను సృజనాత్మకతను, సాంకేతిక పరిజ్ఞానం అర్హతలు గల పట్టబద్రులను అందించి వాటిని ఉద్యోగులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఏది?
ఎ) టి- అసిస్ట్ (T-ASSIST)
బి) టి- వర్క్స్ (T-Works)
సి) టాస్క్ (TASK)
డి) రిసిడ్స్ (RICDS)
34. తెలంగాణ గేమింగ్ యానిమేషన్‌కు సంబంధించిన పార్కు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ) రాయదుర్గం బి) దుర్గం చెరువు
సి) మియాపూర్ డి) అమీన్పూర్
35. సరిగ్గా జతపరిచినవి గుర్తించండి?
ఫార్మాసంస్థ ప్రదేశం
1) శాంతబయోటెక్ ముప్పిరెడ్డి పల్లి
2) జినోమ్వ్యాలి శామీర్‌పేట
3) అరబిందోఫార్మ హైటెక్‌సిటీ
4) ఐడీపీఎల్ బాలానగర్
ఎ) 2 బి) 1 సి) 3 డి) 4
36. ఈ కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) రాష్ట్రంలో ప్రస్తుతం 7 సెజ్‌లు మాత్రమే ఉన్నాయి
2) మహేశ్వరంలో ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ సెజ్‌ని డినోటిఫైడ్ చేయాలనే ప్రతిపాదన ఉంది.
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
37. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో ఏర్పాటు చేసిన తొలి లాజిస్టిక్ పార్క్ ఎక్కడ ఉంది?
ఎ) మంగళంపల్లి బి) కడ్తాల్
సి) నాగులపల్లి డి) బాటసింగారం
38. SHE TEAM (షీ టీమ్ )ని విస్తరించండి?
ఎ) సేప్ట్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్
బి) సెల్ఫ్, హెల్ప్, ఎంపవర్మెంట్
సి) సేప్ట్టీ, హెల్ప్, ఎంపవర్మెంట్
డి) సేఫ్టీ హిట్, ఎన్విరాన్మెంట్
39. T-HUB -20కి సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి?
1) T-HUB -20 ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం
2) ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఫ్రాన్స్‌లో ఉంది
3) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఆవిష్కరించారు
ఎ) 1 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 3
40. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) భారతదేశంలో తోళ్ల పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు
2) దేశంలో తోళ్లపరిశ్రమ పరిశోధన కేంద్రం ఫరీదాబాద్‌లో కలదు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
41. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) భారతదేశంలో పట్టుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక
2) ప్రపంచంలో పట్టుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) ఏదీకాదు
సమాధానాలు
1-ఎ 2-సి 3-ఎ 4-సి 5-డి 6-ఎ 7-బి 8-బి 9-డి 10-ఎ 11-బి 12-సి 13-ఎ 14-సి 15-బి 16-బి
17-డి 18-సి 19-ఎ 20-బి 21-ఎ 22-బి 23-సి 24-డి 25-ఎ 26-సి 27-ఎ 28-బి
29-బి 30-సి 31-బి 32-ఎ 33-సి 34-ఎ 35-డి 36-సి 37-ఎ 38-ఎ 39-సి 40-ఎ 41-సి
ఎం.ప్రవీణ్ కుమార్
విషయనిపుణులు
హైదరబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు